Cricket: దారుణం..7 ప‌రుగుల‌కే ఆలౌట్‌.. ఇందులో3 ఎక్స్‌ట్రాలు, 8మంది ఖాతానే తెర‌వ‌లేదు!

Cricket: క్రికెట్ గేమ్ ఇప్పుడు చిన్న పిల్లాడి నుండి పండుముస‌లి వ‌ర‌కు చాలా వినోదాన్ని అందిస్తుంది. ప్ర‌జ‌లు క్రికెట్‌పై ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో క్రికెట్ కొత్త పుంత‌లు తొక్కుతుంది. ఒక‌ప్పుడు టెస్ట్ సిరీస్‌, వ‌న్డే సిరీస్ అని 50 ఓవ‌ర్స్ మ్యాచ్ ఆడేవారు. కాని ఎప్పుడైతే టీ20 వ‌చ్చి అభిమానుల‌కి బాగా ద‌గ్గ‌రైందో క్రికెట్ విశ్వ‌రూపం పూర్తిగా మారింది. అనేక చోట్ల త‌క్కువ ఓవ‌ర్ల మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి.

బ్యాట్స్‌మెన్ బంతిని బాదే ప‌నిలో ఉండ‌గా, బౌల‌ర్ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌కి దొర‌క్కుండా వేయ‌డం.. ఈ రెండింటి మ‌ధ్య ప్రేక్ష‌కుల‌కి మ‌స్త్ మ‌జా దొర‌కుతుంది. ఇప్పుడు టీ20లే కాదు టీ10లు కూడా మాంచి కిక్ ఇస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో మంచి రికార్డులే కాదు చెత్త రికార్డులు కూడా న‌మోద‌వుతున్నాయి. తాజాగా యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి.

ఈస్ట్‌రింగ్‌స్టన్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. వ‌చ్చిన బ్యాట్స్‌మెన్‌లు ఏదో అర్జెంట్ ప‌ని ఉన్న‌ట్టు ఇలా వ‌చ్చి అలా పెవీలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. జ‌ట్టు సాధించిన ఏడు ప‌రుగుల‌లో టీం బ్యాట్స్‌మెన్ నాలుగు ప‌రు చేయ‌గా, మిగిలిన మూడు ఎక్స్‌ట్రా రూపంలో వ‌చ్చాయి. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 56 బంతుల్లోనే రెండు ఇన్నింగ్స్‌లు ముగియ‌డంతో ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది.

స్ట్‌రింగ్‌స్టన్‌ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా లభించింది. దీంతో ఈ టీమ్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు ఇంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.