Cricket: తాలిబ‌న్స్ ఎఫెక్ట్.. వాయిదా ప‌డ్డ‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌, పాకిస్థాన్ వ‌న్డే సిరీస్

Cricket: తాలిబ‌న్స్ చేతిలో ఆఫ్ఘ‌న్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తున్న‌తాలిబ‌న్స్ విచిత్ర‌మైన రూల్స్‌తో ఇబ్బందిపెడుతున్నారు. వారి ప్ర‌భావం ఇప్పుడు క్రికెట్‌పై కూడా ప‌డింది. పాకిస్థాన్‌తో ఆఫ్ఘ‌నిస్థాన్ ఆడాల్సిన మూడు వ‌న్డేల సిరీస్ వాయిదా వేస్తున్న‌ట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ తొలి వారంలో శ్రీలంక‌లో ఈ సిరీస్ జ‌ర‌గాల్సి ఉంది.

Afghanistan V/s Pakistan Cricket Match Has been Postponed
Afghanistan V/s Pakistan Cricket Match Has been Postponed

ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశమైన పాక్‌తో శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన వన్డే సిరీస్‌పై ముందు నుండి నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సిరీస్‌ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఇటీవ‌ల పేర్కొంది.

తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్‌ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది.కాని ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దీంతో అక్క‌డి క్రికెట్ బోర్డు సిరీస్‌ను వాయిదా వేయాల్సిందిగా పీసీబీని కోరింది.

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి రాక‌పోక‌లకు ఇబ్బందులు ఎదుర‌వ‌డంతోపాటు శ్రీలంక‌లో కొవిడ్ కేసులు పెరిగిపోవ‌డం, ప్లేయ‌ర్స్ మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా సిరీస్ వాయిదా వేస్తున్న‌ట్లు పీసీబీ తెలిపింది. ఆఫ్ఘ‌న్ క్రికెట్ టీమ్ రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లి అక్క‌డి నుంచి శ్రీలంక‌కు విమానంలో వెళ్లాల‌ని ప్లాన్ చేసింది . కాని అది కుద‌ర‌కపోవ‌డంతో ఈ మ్యాచ్ ని 2022లో నిర్వ‌హించే ప్లాన్ చేశారు