Lens: నిర్ల‌క్ష్యం చేసిన మ‌హిళ‌.. కంటి నుండి 27 లెన్స్‌లు వెలికితీత‌

Lens: కొన్ని సార్లు మ‌నం చేసే నిర్ల‌క్ష్యం ఎంత‌టి ప్ర‌మాదాల‌ను కొని తెస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా కంటి విష‌యంలో ఏ మాత్రం అశ్ర‌ద్ధ వ‌హించొద్దు. కంటి విష‌యంలో అశ్ర‌ద్ధ వ‌హిస్తే అంద‌కు త‌గ్గ మూల్యం త‌ప్ప‌క చెల్లించుకోవ‌ల‌సి ఉంటుంది. ఓ మ‌హిళ 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తుండ‌గా, ఈ విష‌యంలో కొంత అశ్ర‌ద్ధ చూప‌డంతో ఆమె కంటి నుండి 27 లెన్స్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇది వైద్యుల‌ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

27 Lens Take Out From Womens Eye
27 Lens Take Out From Womens Eye

సాధార‌ణంగా కంటికి లెన్స్ అనేది క‌ళ్ల జోడుకి వేరో ఆప్ష‌న్‌గా వాడుతుంటారు. కొంద‌రు క‌ళ్ల‌జోడుని పెట్టుకోవ‌డానికి మొహ‌మాట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సున్నిత‌మైన కంటిపై స‌న్నిటి క‌ట‌క‌టాల పొర‌ల‌ను ఏర్ప‌ర‌చుకుంటారు. అయితే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, దుమ్ము-దూళీలో తిరగకూడదని వైద్యులు చెబుతారు. నిద్ర పోయే స‌మ‌యంలోను లెన్స్ తీసి ప‌డుకోవాలి. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ప్ర‌మాదం బారిన ప‌డ‌డం ఖాయం.

యూకేకు చెందిన 67 ఏళ్ల మహిళ కాంటాక్ట్ లెన్స్ విష‌యంలో అశ్ర‌ద్ధ చేయ‌డంతో లేని పోని ఇబ్బందుల‌ని కొనితెచ్చుకుంది. ఇటీవ‌ల తన కళ్లు పొడిబారిపోతున్నాయని, దురద పెడుతున్నాయంటూ వైద్యులను సంప్రదించింది. వ‌యోభారం కార‌ణంగా అయి ఉంటుందని మొద‌ట వైద్యులు భావించారు. కంటికి ప‌రీక్ష‌లు చేస్తే, కుడి కంటి గుడ్డు వెనుక కాంటాక్ట్ లెన్స్ పేరుకుపోయి కనిపించాయి.

లెన్స్ లు ఒకదానికి ఒక‌టి అతుక్కొని అలా 27 ఉన్నాయి. వీట‌న్నింటిని వైద్యులు ఎంతో జాగ్ర‌త్తగా బ‌య‌ట‌కు తీసారు. ఆమె సుమారు 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తోందని, పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆమెకు తెలియకుండానే అవి కంటిలో చిక్కుకున్నాయని వైద్యులు తెలిపారు. లెన్స్ ఎక్క‌డో ప‌డిపోయింద‌ని భావించి మ‌ళ్లీ కొత్త‌వి పెట్టుకోవ‌డంతో అలా 27 కాంటాక్ట్ లెన్స్‌లు మ‌హిళ ఇంట్లో ఉన్నాయ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.

మ‌హిళ‌కు వైద్యం అందించిన ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ ట్రైనీ రుపల్ మొర్జారియా మాట్లాడుతూ.. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సమస్య వల్ల ఆమె చూపుకు ఎలాంటి సమస్య ఏర్పడలేదన్నారు. కంటికి ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉండటంతో కొద్ది రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు. ‘బ్రిటీష్ మెడికల్ జనరల్’లో ఈ అరుదైన కేసును ప్రచురించారు. క‌న్ను దుర‌ద పెట్టే వ‌ర‌కు ఆమెకు లెన్స్‌లు ఉన్న విష‌యం తెలియ‌క‌పోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.