Village: ఇదెక్క‌డి ఆఫ‌ర్..ఆ ఊర్లో ఉంటే రూ. 24.5లక్షల బంప‌ర్ ఆఫ‌ర్

Village: బ‌ట్ట‌ల ఆఫ‌ర్, చెప్పుల ఆఫ‌ర్, వ‌స్తువుల ఆఫ‌ర్స్ విన్నాం కాని గ్రామంలో నివాసం ఉంటే కూడా ఆఫ‌ర్స్ ఇస్తున్నారు ఇట‌లీ ప్ర‌భుత్వం. ఇది విని చుట్టు ప‌క్క‌ల వారంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అయితే వారు ఆఫర్స్ పెట్ట‌డానికి కార‌ణంలేక‌పోలేదు.ఆర్ధిక సంక్షోభం వ‌ల‌న ఇటలీలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు ఖాళీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇళ్లు , ఊర్లు, న‌గ‌రాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

24.5Lakhs Offer to the People Who are in that VIllage
24.5Lakhs Offer to the People Who are in that VIllage

జ‌నాలను ఆక‌ర్షించ‌డంతో పాటు వ‌ల‌స‌గా వెళ్లిన వారిని తిరిగి ర‌ప్పించ‌డం, మ‌ళ్లీ ఆ ప్రాంతాల‌న్ని క‌ళ‌క‌ళలాడేలా చేయాల‌ని భావించి ఇటీవ‌ల కేవలం రూపాయికే ఇళ్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది ఇటలీ ప్రభుత్వం. దేశంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటే ఏకంగా 24.5లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది.

ఎవ‌రైన ఊర్లో అన్ని డ‌బ్బులు ఉట్టిగా ఇస్తారా,దానికి వారు కొన్ని కండీష‌న్స్ అప్లై చేశారు. మ‌రి ఆ కండీష‌న్స్ ఏంట‌నేది ఈ స్టోరీ పూర్తిగా చ‌దివితే తెలుస్తుంది. ఇటలీలోని కలాబ్రియాలో ప్రస్తుతం కేవలం 2 వేల మంది మాత్రమే ఉంటున్నారు. ఏళ్లుగా ఈ గ్రామం ఆర్థికమాంద్యంతో సతమతమవుతోంది. ఇక చేసేదేం లేక ఉపాధి కోసం వ‌ల‌స బాట ప‌ట్టారు. ఇది ఇటలీ ప్ర‌భుత్వానికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

దీంతో వ‌ల‌స‌గా వెళ్లిన వారిని తిరిగి ర‌ప్పించేందుకు ఓ వినూత్న ఆలోచ‌న చేసింది కలాబ్రియా స్థానిక ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు ఈ ప్రాంతంలో అతి తక్కువ ధరకే ఇళ్లను విక్రయిస్తుంది. ఇక్కడ ఇల్లు కొన్న వారికి మూడు ఏళ్ల వ్యవధికి గాను అక్కడి ప్రభుత్వమే 24 వేల పౌండ్లు(24,87,660 రూపాయలు) చెల్లిస్తుంది. కాకపోతే కొన్ని షరతులు పెడుతుంది.

40 ఏళ్ల లోపు వారే ఇళ్లు కొన‌డాకి అర్హులుగా ఉంటారు. అంతేకాక అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించి.. వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించాలి. అది కూడా వారు చెప్పిన గడువులోపే. ఇంటిని కొనుగోలు చేయాల‌నుకున్న‌వారు, వ్యాపారం చేయాల‌నుకునే వారు 90 రోజ‌ల లోపు అధికారుల‌కి ప‌త్రాలు అంద‌జేయాలి. ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పిలుస్తున్నారు.

దీనిపై కలాబ్రియా పట్టణ మేయర్ స్పందిస్తూ.. తమ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇటాలియ‌న్ ప్రాంతంలో నివ‌సించ‌డానికి ప్ర‌జ‌లు అత్యాధునిక సౌక‌ర్యాలు క‌ల్పిస్తా మంటున్నాడు. విద్య‌,వైద్య సేవ‌ల‌తో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తామని తెలిపారు.