Building: 28 గంట‌ల్లో 10 అంత‌స్థులు క‌ట్టేశార‌ట‌.. ఇదెలా సాధ్యం !

Building: డిజిట‌ల్ యుగంలో మ‌న జీవ‌న శైలి ఎంత ఉర‌క‌లు పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఏదైన నిమిషాల‌లో పూర్తి చేసేలా ప‌రిస్థితులు మారుతున్నాయి. ప్ర‌కృతితో పోటీ ప‌డుతూనే త‌న‌కు తానుగా నిరూపించుకుంటున్నారు. ఒక‌ప్పుడు చిన్న ఇల్లు క‌ట్టాలంటే ఎంతో ప్ర‌యాస‌తో కూడుకునేది . కాని ఇప్పుడు స‌ముద్రంలో ఫ్లై ఓవ‌ర్స్ వేస్తున్నారు. ఆకాశ హ‌ర్మ్యాలు, పెద్ద పెద్ద అల‌ల తాకిడిని త‌ట్టుకునేలా బ్రిడ్జిల‌ను రూపొందిస్తున్నారు.

10 Storey Building Built in Just 10 Hours
10 Storey Building Built in Just 10 Hours

మ‌నిషి మెద‌డు ఎంత చురుకుగా పని చేస్తుందో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న మ‌న‌కు తెలియ‌జేస్తుంది. ఒక ఇల్లు క‌ట్టాలంటే పునాదులు తీయ‌లి. పిల్ల‌ర్స్ వేయాలి. ఆ త‌ర్వాత గోడ‌లు, స్లాబ్, ప్లాస్ట‌రింగ్, త‌లుపులు, కిటికీలు, రంగులు ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇదంతో పూర్త‌య్యే స‌రికి చాలా రొజులే ప‌డుతుంది. కాని చైనాలోని చాంగ్షాలో 28 గంటల్లో 10 అంతస్తుల భవనాన్ని కట్టి చరిత్ర సృష్టింంది బ్రాడ్‌ గ్రూప్‌ అనే సంస్థ.

28 గంట‌ల‌లో 10 అంత‌స్థుల భ‌వ‌నం క‌ట్టారంటే ఎవ‌రైన షాక్ కావ‌డం ఖాయం. కాని వారి ఆలోచ‌నా విధానం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. భవన నిర్మాణానికి కావాల్సిన లిఫ్ట్‌ దగ్గర నుంచి పిల్లర్లు, గదులు, గుమ్మాలు, బాత్‌రూమ్‌లు, అల్మారాలు, ఇంటీరియర్లు.. ఇలా ఆ బిల్డింగ్‌కు కావల్సిన సమస్తాన్నీ ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చేశారు .

ముందుగా త‌యారు చేసిన వాటిని ట్ర‌క్కుల్లో నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం. పెద్దపెద్ద క్రేన్ల సాయంతో ఒకదానిపై ఒకటి పేర్చుతూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కరోనా స‌మ‌యంలోను చైనా ప్ర‌భుత్వం ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని షార్ట్ టైంలో రూపొందించి ఔరా అనిపించింది.