Independence : సైకిల్‌పై విన్యాసం చేస్తూ దేశ భ‌క్తి చాటుకున్న అమ్మాయి.. ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండలేరు..!

NQ Staff - August 13, 2022 / 05:09 PM IST

151309Independence : సైకిల్‌పై విన్యాసం చేస్తూ దేశ భ‌క్తి చాటుకున్న అమ్మాయి.. ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండలేరు..!

Independence : దేశ స్వాతంత్ర్యం ఎందరో త్యాగ ఫలం అన్న సంగ‌తి తెలిసిందే. మ‌నం ఈ రోజు ఎంతో ప్ర‌శాంతంగా జీవిస్తున్నామంటే ఎంద‌రో అమ‌ర‌వీరుల పుణ్య‌ఫ‌లం అనే చెప్పాలి. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా కారణంగా భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు..ఇప్పటికే ఎన్నో కళాఖండాలను చూసాము..తాజాగా ఓ మహిళ సైకిల్ పై విన్యాసాలు చేస్తూ దేశ భ‌క్తిని చాటుకుంది.

దేశ భ‌క్తి..

Riding Bicycle with National Flag Going Viral on Social Media

Riding Bicycle with National Flag Going Viral on Social Media

ఒకమ్మాయి ఒక దేశభక్తి గీతానికి జాతీయ జెండా చేతబట్టి.. చెతులు వదిలేసి సైకిల్ తొక్కడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వండర్ ఫుల్ అంటూ కితాబిస్తున్నారు తమ కామెంట్ల ద్వారా, ఇలానే ఇంకొన్నే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూడ్స్ ట్రైన్ వెనుకాల జాతీయ పతాకం రెపరెపలాడుతూ వెళ్తుండటం, చిన్నారులు జాతీయ పతాకం చేతబూని ర్యాలీలు ఇలా అనేక వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లపై, వాహనాలకు జాతీయ జెండాలను పెట్టి జైహింద్ అంటున్నారు.

తమిళనాడుకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకున్నాడు. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్​ వేసుకున్నాడు. వైద్యులు వద్దని చెప్పినా కూడా వినకుండా పెద్ద సాహసం చేశాడు..తమిళనాడు.. కోయంబత్తూరులోని కునియముతుర్​కు చెందిన యూఎస్​డీ రాజా అనే సూక్ష్మ కళాకారుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు.