Independence : సామూహిక జాతీయ గీతాలాపన: హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక సూచన
NQ Staff - August 14, 2022 / 07:10 PM IST

Independence : ఆగస్ట్ 15వ తేదీ ఉదయం 11.30 నిమిషాలకు ఎక్కుడున్నవారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్, ప్రత్యేక సూచన చేయడం జరిగింది.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ళ వద్దా సరిగ్గా ఉదయం 11.30 నిమిషాలకు ‘రెడ్ సిగ్నల్’ పడుతుంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. అక్కడే ప్రత్యేకంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది.
విధిగి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించండి..

National Anthem Played Traffic Signals within Greater Hyderabad
ట్రాఫిక్ సిగ్నల్స్ వున్న ప్రాంతాల్లో రెడ్ సిగ్నల్ పడుతుందనీ, వాహనాలు ఆగిపోతాయి గనుక.. ప్రతి ఒక్కరూ నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని హైద్రాబాద్ సిటీ జాయింట్ కమిషనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) విజ్ఞప్తి చేశారు.
అన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌లోనూ జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు.