Connect with us

Latest News

బెస్ట్ మెగా సిటీ ‘హైదరాబాద్’

Published

on

Share the News from here

కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్చ్‌ సర్వేక్షణ్‌ 2020 ర్యాకింగ్స్‌లో పలు పట్టణాలు సత్తా చాటాయి. దాంట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‌కు “బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్” విభాగంలో నంబర్ వన్ ర్యాంకు లభించింది. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి హైదరాబాద్‌ 23వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో 40 లక్షల జనాభాపై పడిన సిటీల్లో ”బెస్ట్‌ మెగా సిటీ ఇన్‌ సిటిజన్‌” విభాగంలో హైదరాబాద్‌ కు మొదటి అవార్డు దక్కింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్‌పురి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ విషయాన్నీ వెల్లడించారు.

Do NOT follow this link or you will be banned from the site!