horoscope : జనవరి 27th 2021 రాశిఫ‌లాలు : ఆర్థికంగా బాగుంటుంది !

Horoscope today march 3rd 2021 daily horoscope in telugu
Horoscope today march 3rd 2021 daily horoscope in telugu

మేష రాశి : అనవసర ధనవ్యయం !

horoscope : ఈరోజు ఆటంకాలు, చేసే పనుల్లో ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు, అనవసర ధనవ్యయం. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు. విద్యార్థులకు శ్రమపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీగణపతి ఆరాధన చేయండి.

వృషభరాశి: వ్యాపారాలలో లాభాలు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. నూతన వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి.  కొత్త విషయాలు తెలుస్తాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీకృష్ణారాధన చేయండి.

మిధునరాశి : ఆర్థిక సమస్యలు రావచ్చు !

ఈరోజు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రావచ్చు. రుణప్రయత్నాలు చేస్తారు. చేసే పనుల్లో అవాంతరాలు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని దూరప్రయాణాలు. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అనుకోని ఇబ్బందులు రావచ్చు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: వ్యాపారులకు లాభాలు !

ఈరోజు అనుకూలమైన ఫలితాలు. ఆర్థికంగా బాగుంటుంది. చేసే పనులలో కార్యజయం. వ్యాపారులకు లాభాలు. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగార్ధుల యత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీగణపతిని గరికతో ఆరాధించండి.

సింహరాశి: అత్యంత శుభకరంగా ఉంటుంది !

ఈరోజు అత్యంత శుభకరంగా ఉంటుంది. చేసే పనులలో విజయం. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని ధన, వస్తులాభాలు. కుటుంబ వాతావరణం అనుకూలం. వ్యాపారాలలో కొత్త ఆశలు. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. శుభ ఫలితాల కొరకు ఇష్టదేవతారధన చేయండి.

కన్యారాశి : అవనసర వివాదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, గతంలో తీసుకున్న అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. అవనసర వివాదాలు, ఆఫీస్‌లో శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల శ్రీలక్ష్మీదేవిని పచ్చటి పూలతో ఆరాధించండి.

తులారాశి : మిశ్రమ ఫలితాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో చికాకులు తప్పవు. బంధువుల నుంచి పిలుపు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. వైవాహికంగా సంతోషం ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీబుధగ్రహారాధన చేయండి.

వృశ్చికరాశి : ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు బాగుంటగుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రయోజనాలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీరు గౌరవం పొందుతారు. లు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి : ఆర్థికంగా మంచి రోజు !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. అనుకోని మార్గాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు వాహనయోగం. ఉద్యోగాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో ప్రశంసలు రావచ్చు.వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకరరాశి: మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, కానీ పెద్దవారి సహాయంతో వాటిని గట్టెక్కుతారు. ఆఫీస్‌లో మీకు శ్రమ పెరుగుతుంది. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యసూచన కన్పిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు. కుటుంబ సభ్యులతో స్వల్ప విబేధాలు రావచ్చు. వైవాహికంగా సాదారణంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీకాలభైరావష్టకం లేదా శివపంచాక్షరీ చేసుకోండి.

కుంభరాశి : విద్యార్థులకు శ్రమ!

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ మధ్యమధ్యలో ఇబ్బందులు. ఈరోజు ఆర్థిక సమస్యలు కానీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. వ్యాపార విస్తరణ ముందుకు సాగదు. ఉద్యోగస్తులకు చిక్కులు.  విద్యార్థులకు శ్రమ. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఉద్యోగాలలో ప్రోత్సాహం పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

Advertisement