Horoscope : మార్చి 9th 2021 రాశిఫలాలు : నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

Tech Desk-2 - March 9, 2021 / 03:00 AM IST

Horoscope  : మార్చి 9th 2021 రాశిఫలాలు : నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

మేష రాశి: ప్రయాణాలు అనుకూలించవు !

Horoscope : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల వాగ్వాదాలు. నూతన వ్యక్తుల పరిచయం అనర్ధాలు కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలించవు. ఏ విషయంలో అయినా పెద్ద వారి సలహాలు, సూచనలను పాటించడం మంచిది.ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి.

వృషభ రాశి: అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈరోజు బాగుంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

మిధున రాశి: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.ఈరోజు శ్రీ అలవేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి: సోదర సోదరీమణులతో విభేదాలు  !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేకపోతారు. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాలు అనుకూలించవు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల, చికాకుల వల్ల సోదర సోదరీమణులతో విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహ రాశి: సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.ఈరోజు నవరత్నమాలికా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యా రాశి: ధననష్టం !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బందులు. అనవసరపు ఖర్చులు అధికం అవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

తులా రాశి: ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రశాంతత కోల్పోతారు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలించవు. బంధువుల నుంచి అవమానాలు కలుగుతాయి.ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : సమాజ సేవ చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. సమాజ సేవ చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

ధనుస్సు రాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు మార్పిడి అవుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

మకర రాశి: బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలు కలుగుతాయి.ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: తోటిఉద్యోగుల వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన ఆభరణాలు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటిఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు.ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకొండి.

మీన రాశి: ఆలోచనలు కలిసిరావు !

పనులను వాయిదా వేస్తారు.కుటుంబంలో చికాకులు.ఆలోచనలు కలిసిరావు.అనవసర విషయాలలో తలడుర్చడం వల్ల ఇబ్బందులు.ధన నష్టం.కార్యాలయాల్లో ఇబ్బందులు.ప్రయాణాలల్లో మార్పులు.అనారోగ్య సమస్యలు.మనోవేదనకు గురవుతారు.కస్తించిన ఫలితం దక్కదు.బంధువులతో మటపటింపులు.ఆనందలహరి పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us