Horoscope మార్చి 8th 2021 రాశిఫలాలు : ఆర్థిక లబ్ది చేకూరుతుంది !

మేష రాశి: ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు !

Horoscope : మీరు చేసే దానధర్మాలు మీకు ఈరోజు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరాశిలో వివాహము అయినవారికి వారి భార్య తరపు నుండి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. వత్తిడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను ప్రయోజనకరం  ఉంటుంది. తీరికలేని సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు.దుర్గాదేవిని ఆరాధించండి.

వృషభ రాశి: వత్తిడికి గురవుతారు !

ఈరోజు మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడుతాయి. ఆందోళన, వత్తిడికి గురవుతారు. ధనాన్ని పొదుపు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. పెద్దల సలహాలు తీసుకుంటారు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలను ఉంచడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

మిథున రాశి: ఆఫీస్‌లో వత్తిడి ఉంటుంది !

ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆఫీస్‌లో వత్తిడి ఉంటుంది. మీరు గతంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజ నాలను చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు  కలసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్ధులు మిముల్ని వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం కోసం ఏదైనా కొత్తదాన్ని చేస్తారు. పేద వారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

కర్కాటకరాశి: ఆర్థిక లబ్ది చేకూరుతుంది !

ఈరోజు ఆర్థిక లబ్ది చేకూరుతుంది. ఆఫీస్‌లో పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి. బంధువులు/ మిత్రులు ఇంటికి వస్తారు. పని చేసేచోట పై అధికారులతో ప్రశంసలు. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని సంతోషం కలుగుతుంది. పరమశివుడికి అభిషేకం చేయించండి.

Horoscope : సింహరాశి: కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఆనందంగా ఉంటారు. అనుకోని బిల్లులు ఖర్చును పెంచు తాయి. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయ వచ్చు. ఈరోజు కార్యాలయాల్లో ఇబ్బందులు రావచ్చు. దీనికి కుటుంబ సమస్యలు కారణము అవుతాయి. వ్యాపారస్తులు వారి భాగస్వాములపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ భాగస్వామి ఈ రోజు సంతోషానికి కారణమవుతారు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ఏక ముఖి రుద్రాక్షను వేసుకోండి.

కన్యారాశి: దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టకండి !

ఈరోజు మీ పనులను మీ తెలివితేటలతో సులభంగా చేసుకుంటారు. సానుకూలమైన ఆలోచనల వలన మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. వేరేవారి జోక్యం వలన, మీ భాగస్వామితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. ఓం క్రామ్ క్రీమ్ క్రౌమ్ సః బౌమాయ నమః మంత్రాన్ని 11 సార్లు రోజు ఉదయం చెప్పండి, శాంతియుతమైన, ఆనందకరమైన కుటుంబ జీవితం నిర్థారిస్తుంది.

తులారాశి: మీ కుటుంబ జీవితం బాగుంటుంది !

ఈరోజు పెద్దల సలహాలు తీసుకుంటారు. ఆఫీస్‌లో నిరాశ కలుగుతుంది. తెలివిగా మదుపు చెయ్యండి. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా ఉండవు. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్లను అవలంబించండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు సంతోషాన్ని కలిగిస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ, మొక్కజొన్న, బెల్లంతో గోధుమ రంగు ఆవులకు తినిపించండి.

వృశ్చికరాశి: పగలకు దూరంగా ఉండండి !

ఈరోజు సంతోషంగా ఉంటుంది. అనవసర ఆందోళనలు వస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు కానీ వాటిని పెద్దల సలహాలతో అధిగమస్తారు. ఈరోజు అసూయ, పగలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు. ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసు కుంటారు. బాగస్వామిలతో ఆనందం  కరువవుతుంది. ఆర్థిక పరిస్థితి పటిష్ట పరచడం కోసం శివాభిషేకం చేయించండి.

ధనుస్సురాశి: ఈరోజు మనఃశాంతి కలుగుతుంది !

ఈరోజు మనఃశాంతి కలుగుతుంది. అనారోగ్య సూచనలు కలుగుతాయి. విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం మానుకోండి. సహఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరిత గతిన అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది.

మకరరాశి: పని వత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ఆఫీస్‌లో పని వత్తిడి పెరుగుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకొండి. గ్రహరీత్యా, మీకు ఒళ్ళునొప్పుల బాధ కనిపిస్తోంది. ఈరోజు శారీరక అలసటను తప్పించుకొండి. ర్ధికసమస్యల నుండి ఉపశమనము కలుగుతుంది. ఖర్చుదారీతనం వల్ల ఇబ్బందులు.  ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి శివారాధన చేయండి.

కుంభరాశి: ఆర్ధికనష్టాలు తప్పవు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికనష్టాలు తప్పవు. ఈ రోజు దూరప్రాంతాల నుండి బంధువులు మిముల్ని సంప్రదిస్తారు. మీజీవిత భాగస్వామితో గొడవ పడతారు. మీ తెలివితేటలను వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేసే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. దూరప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడుతారు. మంచి ఆర్థిక పరిస్థితి, ఆర్ధిక స్థితి కోసం శివ పంచాక్షరీ జపం చేయండి.

మీనరాశి: ఆర్థికంగా బాగుంటుంది !

గతంలో వచ్చిన విజయం మీకు మీపట్ల నమ్మకాన్ని పెంతుంది. ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుత మైన సమయం ఇది. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పిపిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. సంపదలో పెరుగుదల కోసం ‘ఓం’ ను సూర్యోదయ సమయంలో జపించండి.

Advertisement
Advertisement