Horoscope : మార్చి 31th 2021 రాశిఫలాలు : బకాయిలు వసూలు !

Tech Desk-2 - March 31, 2021 / 03:00 AM IST

Horoscope  : మార్చి 31th 2021 రాశిఫలాలు : బకాయిలు వసూలు !

మేష రాశి: పోటీ పరీక్షల్లో విజయం !

Horoscope : ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. రుణబాధలు తేరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఉద్యోగస్తులు బదిలీ అవుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి: స్నేహితులు శత్రువులు అవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణ ఇబ్బందులు. దుర్గాదేవిని ఆరాధించండి.

Horoscope today  march  31th  2021 daily horoscope in telugu

Horoscope today march 31th 2021 daily horoscope in telugu

కర్కాటక రాశి: బంధుమిత్రులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ధననష్టం కలుగుతుంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి.

సింహరాశి: ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. తెలియని విషయాలను తెలుసుకోవాలని తపన పడతారు. నూతన వ్యక్తులను కలుసుకొని ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. వివాహ సంబంధ విషయాలు ఫలిస్తాయి.మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

కన్యారాశి: బకాయిలు వసూలు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు.ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి: స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సౌఖ్యం పొందుతారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: పనులు వాయిదా పడతాయి !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ధననష్టం జరుగుతుంది. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: ధన లాభం !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాని కొనుగోలు చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు.రామ నామ పారాయణం చేసుకోండి.

మకర రాశి: పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం పొందుతారు.మిత్ర లాభం కలుగుతుంది.శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

కుంభరాశి: అనవసరపు ఖర్చులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటల వల్ల మోసపోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. సమయానికి చేతికి డబ్బులు లేకపోవడం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి: వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. విద్యార్థులు అనవసరపు విషయాల మీద శ్రద్ధ వహించి చదువును అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించక ఇబ్బందులు ఏర్పడతాయి. సోదరుల మధ్య విభేదాలు. స్థిరాస్తులు అనుకూలించవు.ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us