Horoscope : మార్చి 28th 2021 రాశిఫలాలు : శత్రువులు మిత్రులు అవుతారు !

మేష రాశి : తీర్థయాత్రలు చేస్తారు !

Horoscope : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభ రాశి: మొండి బకాయిలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు పోటీపరీక్షల్లో విజయం పొందుతా. ఎదుటి వారికి సహాయం చేయాలని తపన పడతారు. వ్యాపార భాగస్వామ్యం వల్ల లాభాలు. ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సంపద తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. రహస్యాలను బయటకు చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార నష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు.హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

Horoscope today march 28th 2021 daily horoscope in telugu
Horoscope today march 28th 2021 daily horoscope in telugu

కర్కాటక రాశి: శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. పెద్ద వారి సూచనలు పాటిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది, అధిక లాభాలు కలుగుతాయి. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు.ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి: వ్యాపారాల్లో ఒడిదుడుకులు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించక ఇబ్బందులు కలుగుతాయి. తప్పు చేసిన వారిని ప్రోత్సహించడం వల్ల నష్టపోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి: పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్త చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతుల పొందుతారు. వ్యాపార వృద్ధి కలుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి: అప్పుల బాధలు !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు.దుర్గా దేవిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: స్థిరాస్తులు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. స్థిరాస్తులు అనుకూలించవు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఎదుటివారితో తొందరపడి మాట్లాడడం వల్ల సమస్యలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయ పాలన కోల్పోతారు. ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు శివాష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: ఇబ్బందుల నుంచి బయట పడతారు !

ఈ రోజు బాగుంటుంది. కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉన్న ఇబ్బందుల నుంచి బయట పడతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకర రాశి: ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు శ్రమాధిక్యత వల్ల అంతా బాగుంటుంది. విద్యార్థులు అధిక శ్రమ పడి చదువుకోవడం వల్ల పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. సోదరుల మైత్రి. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి: ఈరోజు ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి, స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Horoscope : మీన రాశి: ఆనందంగా ఉంటారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సంతోషంగా ఉంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. మీలో ఉన్న ఇబ్బందులను కుటుంబ సభ్యులతో పంచుకొని ఆనందంగా ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాట విని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో లాభాలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విహార యాత్రలు చేస్తారు.ఈరోజు శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Advertisement