Horoscope : మార్చి 27th 2021 రాశిఫలాలు : ఆర్థికంగా బాగుటుంది !

Tech Desk-2 - March 27, 2021 / 03:00 AM IST

Horoscope :   మార్చి 27th 2021 రాశిఫలాలు : ఆర్థికంగా బాగుటుంది !

మేష రాశి : ఆర్థిక విషయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి !

Horoscope : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.  ఆఫీస్‌లో ఇబ్బందులు కలిగినా వాటిని అధిగమిస్తారు. పెండింగ్‌ పనులు జాప్యం జరుగుతాయి. ఆర్థిక విషయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. విద్యార్థులకు నిజంగా ఇది పరీక్ష సమయం. కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపడుతారు. శ్రీనారసింహ స్వామి వారి దర్శనం ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

వృషభ రాశి: లాభాలు వచ్చే అవకాశం ఉంది !

ఈరోజు ప్రతికూలంతోపాటు కొన్ని విషయాలలో సానుకూలత ఉంటుంది. ఆఫీస్‌లో పై అధికారుల మనన్నలను పొందుతారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారులకు మాత్రం లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుల భారాలు పెరిగే సూచన కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మిథునరాశి: ఆర్థికంగా బాగుటుంది !

ఈరోజు బాగుంటుంది. ఆపీస్‌లో అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బాగుటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులకు మంచి సమయం. వైవాహికంగా బాగుంటగుంది. అనవసర విషయాల జోలికి పోకుంటే ఈరోజు మంచిగా ఉంటుంది. తెల్ల జిల్లేడు పూలతో పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. శుభ ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి: వ్యాపారాలు బాగుంటాయి !

ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సంతోషం కలిగించే రోజు. వ్యాపారాలు బాగుంటాయి. విద్యార్థులకు శ్రమ కానీ మంచి ఫలితం కూడా వస్తుంది. పెద్దల సలహాలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణ అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి శుభం కలుగుతుంది.

సింహరాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు !

ఈరోజు ఇబ్బందులు కలుగవచ్చు. ఆటంకాలు వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆఫీస్‌లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ కొన్ని విబేధాలు వస్తాయి. మంచి ఫలితాల కోసం  శ్రీవిష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మంచి ఫలితాలనిస్తుంది.

Horoscope : కన్య రాశి: వైవాహికంగా సంతోషం ఉండే రోజు !

ఈరోజు శుభఫలితాలు ఉంటాయి. ఆఫీస్‌లో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన సమయం. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికంగా సంతోషం ఉండే రోజు. మంచి ఫలితాల కోసం ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామి,  మహాలక్ష్మి ఆరాధన చేయండి.

తులా రాశి: శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు !

ఈ రోజు అనుకున్నవి పనులను పూర్తిచేస్తారు. గతంలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు,. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సమాజంలో మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. వైవాహికంగా బాగుంటుంది. శ్రీశివాభిషేకంతోపాటు అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి: చేపట్టిన పనులు పూర్తి అవుతాయి !

ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఆఫీస్‌లో అనుకూలమైన వాతావరణం. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. వ్యాపారాలు సంతోషంగా సాగుతాయి. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. విద్యార్థులకు మంచి రోజు, దరఖాస్తు చేసుకోవడానికి మంచిరోజు. బందువులకు సంబంధించిన విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభఫలితాలు పొందడానికి శ్రీఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇది మేలు చేస్తుంది.

ధనుస్సురాశి: బాగా శ్రమించాల్సిన రోజు !

ఈరోజు ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగుతారు. ఆఫీస్‌లో శ్ర మ అధికంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీవిష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి: శుభకార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి !

ఈరోజు బాగుంటుంది. బంధువుల కలయిక, శుభకార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆఫీస్‌లో పై అధికారుల సహకారం లభిస్తుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం. వ్యక్తిగతంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. శ్రీలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: వత్తిడి పెరుగుతుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో అనుకోని పని రావడం, వత్తిడి పెరుగుతుంది. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన.విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. వైవాహికంగా సాధారణ స్థితి. మంచి ఫలితాల కోసం శ్రీవిష్ణు ఆరాధన చేయండి.

మీనరాశి: ఆకస్మిక ధనలాభం !

ఈరోజు అనుకోనిచోట నుంచి లాభాలు రావచ్చు. ఆకస్మిక ధనలాభం, ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు బాగుంటాయి. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. ప్రయాణాలు చేయాల్సిన స్థితి. విద్యార్థులు కొంత శ్రమిస్తేనే మంచి ఫలితం వస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us