Horoscope : మార్చి 26th 2021 రాశిఫలాలు : పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Tech Desk-2 - March 26, 2021 / 03:00 AM IST

Horoscope : మార్చి 26th 2021 రాశిఫలాలు : పెట్టుబడులు అనుకూలిస్తాయి !

మేష రాశి :  ప్రయాణ ఇబ్బందులు !

Horoscope : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత లోపిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యాయి స్వల్ప నష్టాలు కలుగుతాయి. రుణబాధలు తిరుగుతాయి.ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

వృషభ రాశి: శుభకార్యాలు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలు అనుకూలించవు. విద్యార్థులు ఒత్తిడి వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. కార్యాలయంలో పని ఒత్తిడి. వివాహాది శుభకార్యాలు అనుకూలించవు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్థిరాస్తులు అనుకూలించవు.దుర్గాదేవిని ఆరాధించండి.

మిధున రాశి: పెట్టుబడులు అనుకూలిస్తాయి !

వీడియో సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈ రోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. సోదరుల మైత్రి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది, అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. దేవాలయ దర్శనం చేస్తారు.ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి: ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యారాశి: సోదరులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల ఆకస్మిక బదిలీ అవుతారు. విద్యా నష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరులతో విభేదాలు కలుగుతాయి.ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం అవుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు,పోటీ పరీక్షల విజయం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే తపన పడతారు. స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.అన్నపూర్ణాదేవిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధిక శ్రమ వల్ల ప్రమోషన్లు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. మొండి బకాయిలు వసూలవుతాయి. ధన యోగం కలుగుతుంది.కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

Horoscope today march 26th 2021 daily horoscope in telugu

Horoscope today march 26th 2021 daily horoscope in telugu

ధనస్సు రాశి: కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. తొందరపడి ఇతరులకు డబ్బులు ఇవ్వడం వల్ల నష్టం. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడంవల్ల సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు.ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి: వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహన ప్రయాణాలు నష్టం కలిగిస్తాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. పిల్లల విషయంలో శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి, స్వల్ప నష్టాలు కలుగుతాయి.విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభరాశి: పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఖర్చులను తగ్గించుకుంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. కష్టాలను ఎదుర్కొంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. ధన లాభం కలుగుతుంది. అనారోగ్యాలను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. ఈరోజు అష్ట లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us