Horoscope : మార్చి 25th 2021 రాశిఫలాలు : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది !

Tech Desk-2 - March 25, 2021 / 08:50 PM IST

Horoscope : మార్చి 25th 2021 రాశిఫలాలు : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది !

మేషరాశి : బాగా శ్రమించాల్సిన సమయం !

Horoscope : ఈరోజు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. ఆర్థికంగా సాధారనంగా ఉంటుంది. ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టాల్సిన సమయం. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శుభఫలితాల కోసం శ్రీ దత్తత్రేయ కవచం పారాయణం చేయండి.

వృషభరాశి: ఈరోజు ఆనందంగా ఉంటుంది !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సంతోషంగా ఉండే రోజు. వ్యాపారులకు లాభాలు. చాలా కాలంగా ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కష్కారం. బంధువులతో కలిసి విందులు. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి.దైవ చింతన పెరుగుతుంది. వైవాహికంగా మంచి రోజు. అనుకూలమైన ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది !

ఈరోజు శుభంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో మంచి పేరు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంట్లో మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధువులను కలుస్తారు.  వ్యాపారాలలో లాభాలు వస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ గురుచరిత్ర వినడం లేదా పారాయణం చేయడం చేయండి.

కర్కాటకరాశి: ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. అనవసర ఆందోళనలు కలగి అవకాశం ఉంది. అజాగ్రత్తల వల్ల అనారోగ్యాన్ని పొందుతారు.కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు రావచ్చు.వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా మామూలుగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం కనీసం 3 సార్లు చదవండి.

సింహరాశి: పెద్దల సలహాలతో సమస్యలకు పరిష్కారం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు ఆఫీస్‌లో మీరు చేసేపనిని సులభంగా పూర్తిచేస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మానసిక ఆనందం లభిస్తుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ఆనందకరంగా ఉంటాయి. పెద్దల సలహాలతో సమస్యలకు పరిష్కారం. విద్యార్థులు మంచి మార్కలు సాధిస్తారు. వైవాహికంగా సంతోషం, మానసిక ఆనందం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేసుకోండి.

కన్యరాశి: రుణ ప్రయత్నాలు చేస్తారు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆఫీస్‌లో కొంత అనుకూలత. మీరు కోరుకున్న స్థానాలకు బదిలీ అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య సూచన ఉంది. ఏ పనినైనా ఆలోచించి చేయాల్సిన రోజు. విద్యార్థులు బాగా శ్రమించాలి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శుభఫలితాల కోసం శ్రీ సాయిబాబా లేదా దత్తాత్రేయ దేవాలయంలో ప్రదక్షణలు, ధునిలో కొబ్బరికురిడి వేయడం చేయండి.

తులరాశి: ఆశించిన ఫలితం రాదు !

ఈరోజు ఇబ్బందులు వస్తాయి. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. ఆర్థికంగా మామూలుగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. మానసిక ఆందోళన చెందుతారు. ఆఫీస్‌లో మార్పులు కోరుకుంటారు. విద్యార్థులకు శ్రమ కానీ ఆశించిన ఫలితం రాదు. వైవాహికంగా సాధారణ స్థితి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ లలితా సహస్రనామాలను వినండి లేదా పారాయణం చేయండి.

Horoscope today march 25th 2021 daily horoscope in telugu

Horoscope today march 25th 2021 daily horoscope in telugu

వృశ్చికరాశి: శుభ ఫలితాలు కూడా వస్తాయి  !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని శుభ ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆఫీస్‌లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన రోజు. వైవాహికంగా మంచి రోజు. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

ధనుస్సురాశి: ఆఫీస్‌లో పెద్దల సహకారం లభిస్తుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల పరిచయం ఏర్పడుతుంది. మహిళలకు పురుషుల ద్వారా, పురుషులకు మహిళల ద్వారా లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు మంచి ఆలోచనలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంట్లో అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. దైవానుగ్రహం కోసం జపం, యోగా చేసుకోండి.

మకరరాశి: ఆఫీస్‌లో అనుకూలమైన వాతావరణం !

ఈరోజు బాగుంటుంది. ఆఫీస్‌లో అనుకూలమైన వాతావరణం. సహోద్యోగుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. విద్యార్థుల విజయం సాధిస్తారు. బంధువులతో చర్చలు. స్త్రీలు సంతోషంగా ఉంటారు. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

కుంభరాశి: వివాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆఫీస్‌లో వత్తిడి, పని భారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. ఈరోజు మీరుచేసే రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల మూలకంగా ధనవ్యయం. ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు అధిక శ్రమ. వైవాహికంగా బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. శుభఫలితాల కోసం శ్రీరామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మీనరాశి: ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు సంతోషం, ఇబ్బందులు రెండు సమానంగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. కానీ స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక అవకాశాన్ని కోల్పోతారు. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురవుతాయి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. శుభఫలితాల కోసం శ్రీదుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us