మేషరాశి : ఈరోజు ప్రయాణాలు వాయిదా !
Horoscope : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అవసరం కోసం రుణాలు చేస్తారు. అనుకోని విధంగా చివరినిమిషంలో ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. మిత్రలతో విరోధాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీ, శ్రీనివాస ఆరాధన చేయండి.
వృషభరాశి: బాకీలు వసూలవుతాయి !
ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఆఫీస్లో కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. బంధువుల లేదా మిత్రులకు సంబంధించిన శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగార్థులకు అనుకూల ఫలితాలు. మీకు కుటుంబంలో, సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో పురోగతి. పాత బాకీలు వసూలవుతాయి. భూములు, ప్లాట్లకు సంబంధించిన లాభం వచ్చే అవకాశం ఉంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ తారకాన్ని జపించండి.
మిథునరాశి: అనవసర వివాదాలు రావచ్చు జాగ్రత్త !
ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీస్లో పై అధికారుల వత్తిడి, ఆర్థిక సమస్యలు రావచ్చు. బంధువులతో అనవసర వివాదాలు రావచ్చు జాగ్రత్త. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. నిరుత్సాహం. ఇంటాబయటా ఒత్తిడులు. శుభఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి: శుభవార్తలు వింటారు !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్లో అన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పులు పుడుతాయి. చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెద్దల సలహాతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభఫలితాల కోసం శ్రీశ్రీనివాస ఆరాధన చేయండి.
సింహరాశి: గౌరవం పెరుగుతుంది !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్లో మీరు ముఖ్యసమాచారం తెలుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దలతో పరిచయాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికంగా బాగుంటుంది. ఆర్థికంగా సమస్యలు తీరి, సంతోషంగా ఉంటారు. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.
కన్యరాశి: ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో చికాకులు !
ఈరోజు చికాకులు, ఇబ్బందులు రావచ్చు. ఆఫీస్లో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో చికాకులు వస్తాయి. కుటుంబసభ్యుల ఆరోగ్యం పై ఆందోళన. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువులతో వివాదాలు రావచ్చు జాగ్రత్త. వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. శుభఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి: ఆఫీస్లో సమస్యలు రావచ్చు !
ఈరోజు అనవసర వివాదాలు, ఆఫీస్లో సమస్యలు రావచ్చు. సహోద్యోగులు సహకారం అందిస్తారు. కుటుంబంలో వివాదాలు, వాదనలు. విద్యార్థులు చదువును వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ప్రయాణాలు అనుకూలించవు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన, చాలీసా పఠనం చేయండి.
వృశ్చికరాశి: ఆర్థికంగా సమస్యలు తీరిపోతాయి !
ఈరోజు బాగుంటుంది. ఆఫీస్లో మీకు మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా సమస్యలు తీరిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనుస్సురాశి: వ్యాపారులకు లాభాలు వస్తాయి !
ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్లో పెద్దల పరిచయాలు పెరుగుతాయి. ఆఫీస్లో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పెద్దలతో పరిచయాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఆర్థికంగా సంతోషం. వ్యాపారులకు లాభాలు వస్తాయి. శుభఫలితాల కోసం శ్రీరామ ఆరాధన చేయండి.
మకరరాశి: ప్రయాణాలు వాయిదా పడుతాయి !
ఈరోజు ప్రయాణాలు వాయిదా పడుతాయి. అనుకోని సమస్యలు రావచ్చు. ఆఫీస్లో ఇబ్బందులు. కుటుంబంలో వ్యయప్రయాసలు, ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు చేజారవచ్చు. ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ బాగా చేయాల్సిన రోజు. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని, విష్ణువును ఆరాధించండి.
కుంభరాశి: కుటుంబ సభ్యులకు అనారోగ్యం !
ఈరోజు అనవసర ప్రయాసలు. ఆర్థిక సమస్యలు రావచ్చు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు రావచ్చు. మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం లేదు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శుభఫలితాల కోసం శ్రీరామ నామాన్ని జపించండి.
మీనరాశి: విద్యార్థులకు మంచి సమయం !
ఈరోజు సానుకూలమైన వాతావరణం. ఆఫీస్లో కొత్త మార్పులు. మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు. బంధువుల కలయిక. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా సంతోషమైన రోజు. అదేవిధంగా వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.