Horoscope : మార్చి 19th 2021 రాశిఫలాలు : వ్యాపారాలు కలిసివస్తాయి !

మేషరాశి : ధన నష్టం !

Horoscope : ఈరోజ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రతను చూపండి. మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజంతా క్షణం తీరిక లేకుండా ఉంటారు. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త. సూర్యారాధన చేయండి.

మిధునరాశి: వ్యాపారాలు కలిసివస్తాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే ఉన్నత ఉత్తీర్ణతను సాధిస్తారు. గొప్పవారితో పరిచయాన్ని పెంచుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: ఆటంకాలు అధిగమిస్తారు !

కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. అనవసర విషయాలలో తలదూర్చకండి. మీరు చేసే పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీరామనామ జపం మంచి ఫలితాన్నిస్తుంది.

సింహరాశి: విజయాన్ని పొందుతారు !

ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు తాత్కాలిక ఉద్యోగం పర్మినెంటు అయ్యే అవకాశం ఉంది. పనిచేసే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. నూతన పథకాలను ప్రారంభించడానికి మంచిరోజు. శ్రీసూక్తంతో అమ్మవారికి అభిషేకం లేదా పూజ చేయండి.

కన్యారాశి: ప్రయాణాలు వాయిదా !

ఈరోజు ప్రమాదకరంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. మానసిక వేదన పడతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. శ్రీదుర్గాసూక్త పారాయణం చేయండి.

తులారాశి: సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది.  అధిక ధనలాభం కలుగుతుంది. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు మిత్రుల రాక సంతోషాన్ని కల్పిస్తుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఈరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యం చేయడానికి ఆలోచిస్తారు.ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

Horoscope : వృశ్చిక రాశి: శుభ వార్తలు !

ఈరోజు కొత్త ఒప్పందాలు వాయిదా వేసుకోండి. పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. మీరు చేస్తున్న రంగంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: ప్రశాంతతను పొందుతారు !

ఈరోజు ధన లాభం కలుగుతుంది. పనులు సాఫీగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రశాంతతను పొందుతారు. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి సంతోషాన్ని, ప్రశాంతతను పొందుతారు.

మకర రాశి: పోటీ పరీక్షల్లో రాణిస్తారు !

తల్లిదండ్రులు చెప్పిన మాటలు  వినడం మంచిది. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచిరోజు. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మిత్రుల రాక సంతోషాన్ని కల్పిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: వ్యాపార అభివృద్ధి !

ఈరోజు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఆర్థిక లాభం కలుగుతుంది. ఈరోజు తోబుట్టువులతో కలిసిమెలిసి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

మీనరాశి: బిజీగా ఉంటారు !

ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Advertisement