Horoscope : మార్చి 17th 2021 రాశిఫలాలు : కార్యాలయాల్లో ప్రమోషన్లు !
Tech Desk-2 - March 17, 2021 / 03:00 AM IST

మేష రాశి : శ్రమకు తగ్గ ఫలితం !
Horoscope :ఈ రోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.
వృషభ రాశి: సోదరులతో విభేదాలు !
ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా పడతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరులతో విభేదాలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికమాలను గణపతికి సమర్పించండి.
మిధున రాశి: తీర్థయాత్రలు చేస్తారు !
ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. పదోన్నతులు పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధన లాభం కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.
కర్కాటక రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు !
ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది, లాభాలు కలుగుతాయి. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు.ఈరోజు గణపతిని ఆరాధించండి.
సింహరాశి: వ్యాపారాలో అధిక లాభాలు !
ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి.ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
కన్యారాశి: కుటుంబ సభ్యులతో సమస్యలు !
ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసర విషయాల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతోంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. రుణబాధలు పెరిగిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకోలేక ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
Horoscope :తులారాశి: ప్రయాణ లాభం !
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి: అందరినీ ఆకట్టుకుంటారు !
ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. గతంలో ఉన్న శత్రువులు కూడా తిరిగి మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి.ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.
ధనస్సు రాశి: ఆనందంగా ఉంటారు !
ఈ రోజు అంతా బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా ఉంటారు.ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.
మకర రాశి: స్వల్ప నష్టాలు !
ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అండగా ధననష్టం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో మీ అంతట మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఇతరుల మీద ఆధార పడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.
కుంభరాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు !
ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.
మీన రాశి: పనిభారం పెరుగుతుంది !
ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మాట తీరు బాగా లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. సమస్యలు ఎదురవుతాయి. అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.