Horoscope : మార్చి 16th 2021 రాశిఫలాలు : ప్రముఖులతో పరిచయాలు !

మేష రాశి : ఆకస్మిక ప్రయాణాలు !

Horoscope : ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. రుణయత్నాలు.ఆకస్మిక ప్రయాణాలు. మీ సన్నిహితులు, స్నేహితులు మీకు పూర్తిగా సహకరిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. అష్ట లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఉద్యోగాలలో అనుకూలత !

పనులు చకచకా సాగుతాయి.మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూలత. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఆటంకాలు తొలగుతాయి !

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. సంతోషంగా గడుస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. మీ సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక చింతన !

ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ప్రతి విషయంలోమీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల లాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహ రాశి: శుభవార్త వింటారు !

ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా. లక్ష్యాలను సాధిస్తారు.  పనులను పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. దైవదర్శనాలు. రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Horoscope : కన్య రాశి: ఉల్లాసంగా ఉంటారు !

రుణాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఉద్యోగాలలో మరింత అనుకూలం. మీరు ఉల్లాసంగా ఉంటారు. విందువినోదాలు. మీ సహోద్యోగులు, పై అధికారులు మీకు మద్దతు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

తులా రాశి: వ్యవహారాలలో విజయం !

మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: అనుకూల పరిస్థితులు !

ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ కుటుంబంలో శుభకార్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మంచి సమయం. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 21 ప్రదక్షణలు చేయండి .

ధనుస్సు రాశి: ఉద్యోగ మార్పులు !

శ్రమాధిక్యం. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఇతరులు మీకు సహాయం చేస్తారు. వీలైనంత వరకు వివాదాలకు దూరం గా ఉండడం మంచిది. ఉద్యోగ మార్పులు. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి: ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ఈరోజంతా సరదాగా గడిపేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రుల కలయిక. పనుల్లో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభ రాశి: కార్యాలయాల్లో అవమానాలు !

వ్యవహారాలలో అవరోధాలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అవమానాలు. ఆరోగ్యం బాగుండదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఆస్తి ఒప్పందాలు !

కుటుంబంలో శుభకార్యాలు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి ఒప్పందాలు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆలయ దర్శనాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దుర్గా దేవిని ఆరాధించాలి.

Advertisement