Horoscope : మార్చి 13th 2021 రాశిఫలాలు :

Tech Desk-2 - March 13, 2021 / 03:00 AM IST

Horoscope : మార్చి 13th 2021 రాశిఫలాలు :

మేషరాశి : ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి !

Horoscope : ఈరోజంతా తీరిక లేకుండా గడిచిపోతుంది. వ్యవహారాలలో విజయం. సమాజం పట్ల మీ భౌతిక దృక్పధం మారుతుంది. పనిని ఇష్టం గా చేయండి. ఇంటర్వ్యూలు అందుతాయి. ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజం లో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మీనాక్షి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభరాశి: ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. దైవదర్శనాలు. కొంత కష్టపడ్డా మీకు ఫలితం దక్కుతుంది. భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

మిధునరాశి: పనుల్లో అడ్డంకులు !

వ్యవహారాలు మందగిస్తాయి.ఈరోజు శ్రమాధిక్యం. చేపట్టిన పనుల్లో ఎక్కువ అడ్డంకులు వస్తుంటాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. మీరు ఈరోజు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బంధువులతో తగాదాలు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి: ఆర్థిక ఇబ్బందులు !

ఈరోజు పరోపకారం చేయడంలో ముందుంటారు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారం లో మౌనంగా ఉండడం ఈరోజు మీకు కలిసొచ్చేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

సింహరాశి: పరిచయాలు పెరుగుతాయి !

పరిచయాలు పెరుగుతాయి.కార్యాలయం లో మీరు పునరావాసం పొందుతారు. కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యరాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు ఆనందం గా గడుస్తుంది. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. శుభవార్తలు వింటారు. నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి: దైవదర్శనాలు !

అదృష్టం కలిసి వస్తుంది. దైవదర్శనాలు.  వ్యాపారం పై దృష్టి ని ఉంచండి. దూరప్రయాణాలు. కుటుంబ సభ్యులతో సంతోషం గా గడపండి. అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి: అనుకోని ప్రయాణాలు !

ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. భార్య పిల్లలతో సంతోషకర సమయం గడుపుతారు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనుస్సురాశి: ఆస్తి వివాదాలు !

ఈరోజు శుభప్రదం గా గడుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. ఆహ్వానాలు అందుతాయి. మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. లక్ష్మీ నరసింహ అష్టక పారాయణం చేసుకోండి.

మకరరాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

మీ కోరికలను నెరవేర్చుకోగలరు. సమస్యలను పరిష్కరించుకుంటారు. రుణయత్నాలు. పనులను సమర్ధవంతం గా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. మనసులో విచారం మాయం అవుతుంది.కుటుంబ సభ్యులతో ఉల్లసము గా గడుపుతారు. ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

కుంభరాశి: పనులు పూర్తి !

ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పటికీ మీదే విజయం అవుతుంది. ఆత్మీయుల నుంచి పిలుపు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. అహ్వానాలు అందుతాయి. మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. రాజరాజేశ్వరి అష్టకం పారాయణ చేసుకోండి.

మీనరాశి: ప్రయాణాలలో మార్పులు !

ఈరోజు సానుకూలం గా గడుస్తుంది. సోదరులతో కలహాలు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపదను ప్రయోజకరంగా వినియోగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. పెట్టుబడుల వల లాభాలు. గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us