Horoscope : మార్చి 12th 2021 రాశిఫలాలు : వ్యాపారాలు సాఫీగా సాగుతాయి !
Tech Desk-2 - March 12, 2021 / 03:00 AM IST

మేషరాశి : ఈరోజు సంతోషంగా ఉంటారు !
Horoscope : ఈరోజు సంతోషంగా ఉంటారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార విషయాలు జాగ్రత్త. ఆఫీస్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీశివపూజ చేసుకోండి.
వృషభరాశి: ఆనందంగా గడుపుతారు !
ఈరోజు శ్రమాధిక్యంగా గడుస్తుంది. ఆఫీస్‌లో అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న పనులు చేస్తుంటే ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేస్తారు., కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు బాగా శ్రమిస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శివార్చన చేసుకోండి.
మిధునరాశి: ఆర్థికంగా బాగుంటుంది !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో అనుకూలమైన వాతావరణం. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం ఈ రోజు మీకు కలసి వస్తుంది. లాభాలు వస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
కర్కాటకరాశి :వ్యాపారాలకు లాభాలు !
ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ఆఫీస్‌లో మీకు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయమై మీరు కొంత ఆందోళన చెందుతారు. అనవసర ఖర్చులు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువాల్సిన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
సింహరాశి: విద్యార్థులు మంచి వార్తలు వింటారు !
ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో ఆటంకాలు, పై అధికారుల వత్తిడి అయినా అధిగమిస్తారు. పాత ఆస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. బంధువుల నుంచి మీరు శుభ వార్తలు వింటారు. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. లక్ష్మీ, కుబేర పూజ, ఆరాధన చేయండి.
కన్యరాశి: ఆందోళన మాయం అవుతుంది !
ఈరోజు బాగుంటుంది. ఆఫీస్‌లో మంచి పేరు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. మనసులో ఆందోళన మాయం అవుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలను చర్చిస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
Horoscope : తులారాశి: శ్రమ ఎక్కువగా ఉంటుంది !
ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆపీస్‌లో అవకాశాలు వస్తాయి. వాటిని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. వ్యాపారులకు లాభాలు, ఆర్థికంగా బాగుంటుంది.వివాదాలకు, గొడవలను నివారిస్తుంది. బంధువుల రాక మీకు సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు గతంలో ఉన్న ఆందోళన పోతుంది. వైవాహికంగా సంతోషంగా ఉంటుంది. శివార్చన మంచి ఫలితాన్నిస్తుంది.
వృశ్చికరాశి: ఈరోజు ఆనందంగా ఉంటుంది !
ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు కలసివస్తాయి. ఆఫీస్ లో మంచి వాతావరణం ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. కుటుంబ సభ్యుల సలహా లు, మద్దతుతో మీరు పనులు పూర్తిచేస్తారు. పిల్లలతో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. వైవాహికంగా మంచి రోజు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
ధనుస్సురాశి: చిన్నిచిన్న సమస్యలు వస్తాయి !
ఈరోజు బాగుంటుంది. ఆఫీస్‌లో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులకు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నిచిన్న సమస్యలు వస్తాయి. కానీ పెద్దల సహకారంతో ముందుకుపోతారు. విద్యార్థులు కెరీర్ లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. శివాభిషేకం, ఆరాధన చేయండి.
మకరరాశి: ఈరోజు శుభయోగం !
ఈరోజు శుభయోగం ఉంది. ఆఫీస్‌లో మంచి ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు, ఆర్థికంగా స్వావలంబనం ఉంటుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోండి. విజయం లభిస్తుంది. ఇష్టమైనవారిని కలుస్తారు, బంధువుల నుంచి ముఖ్యసమాచారం వింటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ సూక్తపారాయనం చేయండి.
కుంభరాశి: సానుకూలమైన వాతావరణం !
ఈరోజు సానుకూలమైన వాతావరణం. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి కానీ వాటిని అధిగమిస్తారు. ఆనందంగా గడుస్తుంది. కుటుంబంలో ముఖ్యసమాచారం అందుంతుంది. పెద్దల సహకారం అందుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీదుర్గాదేవి దగ్గర దీపం పెట్టండి.
మీనరాశి: వ్యాపారాలు సాఫీగా సాగుతాయి !
ఈరోజు విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆఫీస్‌లో మీ ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పటికీ మీరు విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు పాటించి ముందుకుపోతారు. కుటుంబ సభ్యుల విషయంలో చిన్న ఆందోళన చెందుతారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా బాగుంటుంది. గాయత్రీదేవిని ఆరాధించండి.