horoscope : జనవరి 31st 2021 రాశిఫ‌లాలు : అనుకోని వివాదాలు రావచ్చు !

Horoscope today february 26th 2021 daily horoscope in telugu
Horoscope today february 26th 2021 daily horoscope in telugu

మేషరాశి : రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది !

horoscope : ఈ రోజు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కానీ ఇంట్లో ఖర్చులు పెరిగి రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు కలసి ముఖ్యవిషయాలు చర్చిస్తారు. అనారోగ్య సూచన, ఆఫీస్‌లో శ్రమాధిక్యం. స్నేహితులు, బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారంలో చిన్నచిన్న సమస్యలు. అనుకూలమైన ఫలితాల కోసం హనుమాన్‌ దేవాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షణలు చేయండి.

వృషభరాశి : వస్తువులు, గృహోపకరణాలు కొంటారు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. వస్తువులు, గృహోపకరణాలు కొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. కొత్త పరిచయాలు. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాలకోసం శ్రీ శివపంచాక్షరీ మంత్రాన్ని పారాయణం చేయండి.

మిధునరాశి : ఆర్థికంగా ఇబ్బందులు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఆఫీస్‌లో పరిస్థితులు అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత నిరాశ. కుటుంబ సభ్యులతో వాదనలు, అనవసర విషయాలతో సమయం వృథా. వైవాహికంగా మామూలుగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం నవగ్రహలకు ప్రదక్షనలు చేయండి.

కర్కాటకరాశి : వ్యాపారులకు లాభాలు !

ఈరోజు సమస్యలు పోతాయి. ఇబ్బందుల నుంచి పెద్దల సహాయంతో గట్టెక్కుతారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు లాభాలు రావచ్చు. కుటుంబంలో సమస్యలు పోతాయి. అనుకోని చోటు నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలకోసం దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షనలు చేయండి.

horoscope : సింహరాశి : అనుకోని వివాదాలు రావచ్చు !

ఈరోజు ఆటంకాలు, సమస్యలు రావచ్చు. ఆర్థికంగా బాగుండదు. అనుకోని వివాదాలు రావచ్చు. చేసే పనులు, వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. మంచి ఫలితాలు రావడానికి రామనామాన్ని జపించండి.

కన్యారాశి : ఉద్యోగాలలో కొత్త అవకాశాలు !

ఈరోజు బాగుంటుంది. ఆర్థికంగా సంతోషం, వ్యాపారులకు లాభాలు, వస్తులాభాలు. కుటుంబ సభ్యులతో కలసి శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. పెద్దలతో పరిచయాలు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా ఆనందం, సంతోషం కలుగుతుంది. అనుకూలమైన ఫలితాల కోసం ఆదిత్య ఆరాధన చేయండి.

తులారాశి : అనుకోని ధనప్రాప్తి !

ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా లాభాలు, అనుకోని ధనప్రాప్తి,. కుటుంబ సభ్యులతో సరదా, సంతోషం కలుగుతుంది. చేసే పనులలో పురోగతి. పాతమిత్రుల కలయికఉద్యోగాలు సజావుగా సాగుతాయి. విద్యార్తులకు అనుకూలైన కాలం. వైవాహికంగా అత్త్యుత్తమ కాలంగా చెప్పవచ్చు. అనుకూలమైన ఫలితాల కొరకు హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి : అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు !

ఈరోజు చిన్నచిన్న ఇబ్బందులు, ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు, రుణప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. చేసే పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆఫీస్‌లో బాగుండదు, శ్రమించాల్సిన సమయం. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీఆంజనేయ దండకాన్నిపారాయణం చేసుకోండి.

ధనుస్సురాశి : బంధువుల నుంచి వత్తిడులు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. బంధువుల నుంచి వత్తిడులు. చేసే పనుల్లో జాప్యం. కుటుంబ వ్యవహారాలలో చికాకులు. ఉద్యోగాలు చిన్నచిన్న సమస్యలు, విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాకపోవచ్చు, వైవాహికంగా ఇబ్బంది కానీ చివరికి అంతా అదిగమిస్తారు. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి : సమాజంలో గౌరవం పెరుగుతుంది !

ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి. కొత్త పరిచయాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల నుంచి లేదా పాతమిత్రుల నుంచి పిలుపు రావచ్చు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి రోజు. శుభ ఫలితాల కోసం శ్రీసరస్వతీ దేవి ఆరాధన చేయండి.

కుంభరాశి : కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలు !

ఈరోజు బాగుంటుంది. ఆర్థికంగా మంచి రోజు, పెద్దల సహకారంతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతారు. బంగారం, వస్తువులు కొంటారు. ఆఫీస్‌లో మంచిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి : అప్పులు తీసుకోకండి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అప్పులు తీసుకోకండి. ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నంచేయండి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. అనారోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త. అనుకోని ప్రయాణాలు,మీ వస్తువులు జాగ్రత్త పోయే అవకాశం. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. శుభఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement