మేష రాశి : విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు !
horoscope : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో పై అధికారులతో సఖ్యత, విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు. వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకూల ఫలితాల కోసం శ్రీగురుదత్త శ్లోకాలు చదువుకోండి.
వృషభరాశి : ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది !
ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు నిరాశజనకంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఉద్యోగులకు వత్తిడి, ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. అనుకోని కుటుంబంలో ఒత్తిడులు. అవాంతరాలు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీసాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మిధునరాశి : కుటుంబంలో గందరగోళం !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి వత్తిడి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబంలో గందరగోళం. దూరప్రయాణాలు చేసే అవకాశం. అనారోగ్య సూచన. ఆఫీస్‌లో శ్రమాధిక్యం. పనలు నత్తనడకన సాగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీదత్తాత్రేయ కవచం పారాయణం చేయండి.
కర్కాటకరాశి : వ్యాపారులకు అనుకోని లాభాలు !
ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు ఆర్థికంగా కలసి వస్తుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు రావచ్చు. స్థిరాస్తిలాభం. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో చర్చిన కార్యాలు కార్యరూపం దాలుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
సింహరాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఆర్థిక ఇబ్బందులు కానీ చివరకు వాటిని అధిగమిస్తారు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఆఫీస్‌లో సహోద్యుగుల నుంచి వత్తిడి, వ్యయప్రయాసలు. కుటంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. సానుకూలమైన ఫలితాల కోసం శ్రీరామజయరామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.
కన్యారాశి : కుటుంబ సభ్యుల నుంచి సహకారం !
ఈరోజు బాగుంటుంది. అనుకోని ఆర్థిక లాభాలు రావచ్చు. వ్యాపారులకు సాధారణ లాభాలు వస్తాయి. కొత్త చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి.. కుటుంబ సభ్యుల నుంచి సహకారం, ఆఫీస్‌లో కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగాలలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతికి గరికతో పూజ చేయండి,
తులారాశి : కుటుంబంలో సమస్యలు !
ఈరోజు ఆటంకాలు. ఇబ్బందులు, అనుకోని ఆర్థిక సమస్యలు, అనవసర ఖర్చులు రావచ్చు. దైవదర్శనాలు. అనారోగ్య సమస్యలు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీగురుచరిత్రను పారాయణం చేయండి.
వృశ్చికరాశి : వ్యాపారులకు లాభాలు రావచ్చు !
ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు లాభాలు రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు. ఆఫీస్‌లో పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విజయాలు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీదత్త కవచం పారాయణం చేయండి.
horoscope : ధనుస్సురాశి : ఆర్థికంగా లాభాలు !
ఈరోజు కొత్త సంఘటనలు జరుగుతాయి. ఆర్థికంగా లాభాలు, వ్యాపారులకు అనుకోని లాభాలు. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం. చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
మకరరాశి : ప్రయాణాలు వాయిదా పడే అవకాశం !
ఈరోజు అనుకోని కష్టాలు. గ్రహచలనం రీత్యా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు. కుటుంబసభ్యులతో సమ్యసలు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీకృష్ణ అష్టకం చదువుకోండి.
కుంభరాశి : ప్రతికూలంగా ఉంటుంది !
ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు అనుకోని చోట నుంచి వివాదాలు. అనుకోని పనులు వస్తాయి. ఆర్థికంగా బాగుండదు., వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేయించండి.
మీనరాశి : శుభవార్తలు వినే అవకాశం ఉంది !
ఈరోజు బాగుంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త ఆర్థిక ఒప్పందాలు. వస్తులాభాలు. ఆఫీస్‌లో అనుకూలమైన వాతావరణం. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం బాబా దేవాలయంలో ప్రదక్షణలు లేదా దత్తాత్రేయ ఆలయలో ప్రదక్షణలు చేయండి.