horoscope : ఫిబ్రవరి 22nd 2021 రాశిఫలాలు : మొండి బాకీలు వసూలు !

Horoscope today march 8th 2021 daily horoscope in telugu
Horoscope today march 8th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

horoscope : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, కుటుంబ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు,ఉన్నత ఉద్యోగాలను పొందుతారు.ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆరాధించండి.

వృషభ రాశి: వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మాట జారడం వల్ల నష్టం. అనవసరపు విషయాలు చర్చించడం వల్ల ఇబ్బందులు. తక్కువ మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. డబ్బులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.ఈరోజు శివాష్టక పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని శివాభిషేకం చేయించుకోండి.

మిధున రాశి: మొండి బాకీలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అనవసరపు ఖర్చులను దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

horoscope : కర్కాటక రాశి: స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేయడం వల్ల నష్టం. సమయానికి డబ్బులు అండక ఇబ్బందులు కలుగుతాయి. అనవసరపు వ్యక్తులతో మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయి.దుర్గాదేవిని ఆరాధించండి.

సింహరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు బాగుంటుంది. అనారోగ్యాలను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. అందరితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు.రామ నామ పారాయణం చేసుకోండి.

కన్యారాశి: పెట్టుబడుల వల్ల లాభాలు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. పెద్దవారి మాటలను, సూచనలను పాటించడం మంచిది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. స్నేహితుల సహకారం పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి: పనులన్నీ పూర్తి అవుతాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. పెద్ద వారిని గౌరవించడం వల్ల అనుకున్న పనులన్నీ సానుకూలంగా పూర్తి అవుతాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: సహాయం చేసేవారు దూరం !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. ప్రయాణాలు అనుకూలంచవు. సోదర సోదరీమణులతో చిరాకు పడడం వల్ల విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసిమెలసి ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. సోదరులతో సఖ్యత గా ఉంటారు.సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి: కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంటు ఉద్యోగం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ కళాశాలల్లో సీట్లు పొందుతారు. ఆత్మీయ కలయిక సంతోషపరుస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంటు ఉద్యోగం పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో ఆస్తులు అనుకూలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.  నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధించండి.

కుంభరాశి: కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ వహించడం వల్ల నష్టం. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి: వ్యవహారాలలో జాగ్రత్త !

ఈరోజు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలిసి రావు. బంధువులతో మాటపట్టింపులు. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి. పనులు ముందుకు సాగవు. క్రయవిక్రయాల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement