Horoscope : ఫిబ్రవరి 1st 2021 రాశిఫ‌లాలు : శుభవార్తలు వింటారు !

Horoscope today march 3rd 2021 daily horoscope in telugu
Horoscope today march 3rd 2021 daily horoscope in telugu

మేష రాశి : రుణాల కోసం ప్రయత్నాలు !

Horoscope : ఈరోజు ఆటంకాలు, పనులలో నెమ్మదితనం. అనవసర వివాదాలు రావచ్చు జాగ్రత్త. ఆర్థికంగా బాగుండదు. రుణాల కోసం ప్రయత్నాలు. కుటుంబ సభ్యులతో అనవసర చర్చలు, వివాదాలకు అవకాశం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీశివపంచాక్షరీ మంత్రాన్ని పారాయణం చేయండి.

వృషభరాశి: విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో అనారోగ్యసమస్యలు, వివాదాలు రావచ్చు. ఆర్థికంగా మందగమనం. దూరప్రాంత బంధువుల నుంచి సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. అనవసర ఒత్తిడులు.ఆఫీస్‌లో ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శుభ ఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేసుకోండి.

మిధునరాశి : వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు అన్నింటా విజయం. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.అనుకూలత, ఫలితాలతో ఆనందం. విద్యార్థులకు విజయం, కుటుంబంలో ముఖ్యవిషయంపై చర్చ, శుభకార్య సూచన. ఆఫీస్‌లో సమస్యలు తీరి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటకరాశి: ఆర్థికంగా బాగుండదు !

ఈరోజు ఇబ్బందులు, అనవసర ప్రయాసలు. ఆర్థికంగా బాగుండదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. అనవసర ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వత్తిడి ఎక్కువుతుంది. ఉద్యోగులకు కొన్ని మార్పులు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు కానీ భవిష్యత్‌కు పునాది పడుతుంద. మంచి ఫలితాల కోసం శ్రీశివ ఆరాధన, శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

Horoscope : సింహరాశి : శుభవార్తలు వింటారు !

ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చిరకాల మిత్రుల కలయిక. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టండి.

కన్యారాశి : కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది !

ఈరోజు వృథా ప్రయాసలు, అనుకోని ఇబ్బందులు రావచ్చు. గృహంలో సమస్యలు రావచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆఫీస్‌లో తోటి ఉద్యోగులతో విభేదాలు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. మంచి ఫలితాల కోసం శ్రీరుద్రాభిషేకం చేసుకోండి.

తులారాశి : శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో సహోద్యోగులు సహకారం లభిస్తుంది. విద్యార్థులకు బాగుంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు.వైవాహకంగా బాగుంటుంది. మంచి జరుగడానికి శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి : వ్యాపారులకు అనుకోని లాభాలు రావచ్చు !

ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. పెద్దల సహకారంతో, వారి సలహాలతో ముఖ్యమైన పనులు చేస్తారు. ఈరోజు ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు అనుకోని లాభాలు రావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం. ఉద్యోగాలలో నూతనోత్సాహం విద్యార్థులకు ఏదైనా పరీక్షకు ప్రిపేర్‌కావడానికి కొత్తగా ప్రారంభించడానికి అనుకూలం. శుభఫలితాల కోసం శ్రీ శివకవచం పారాయణం చేయండి.

ధనుస్సురాశి : ఆర్థికంగా బాగుండదు !

ఈరోజు చాలా అలసటగా ఉంటుంది. ఆఫీస్‌లో, ఇంట్లో మీకు వత్తిడి, శ్రమాధిక్యం. అనారోగ్యం. చేసే కార్యాలలో ఆటంకాలు. ఆర్థికంగా బాగుండదు. వ్యయప్రయాసలు. స్నేహితులు, కావల్సిన వారితో అనవసర తగాదాలు. ఆఫీస్‌లో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. వైవాహికంగా బాగుంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీ అష్టోతరం చదవండి.

మకరరాశి : ఆఫీస్‌లో పని వత్తిడి !

ఈరోజు మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో వత్తిడులు కానీ పెద్దల సహకారంతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు అనుకున్నంత సజావుగా సాగవు. ఆఫీస్‌లో పని వత్తిడి. అనుకోని ప్రయాణాలు. ఆనారోగ్య సమస్యలు. ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు బాగా శ్రమకానీ మంచి ఫలితం రావచ్చు, వైవాహికంగా బాగుంటుంది. శ్రీశివ పంచాక్షరీ జపం చేయండి.

కుంభరాశి  : ఆర్థికంగా సంతోషకరంగా ఉంటారు !

ఈరోజు అనుకూలమైన ఫలితాలు, గ్రహచలనం రీత్యా కొన్ని వ్యయప్రయాసలు ఉన్నా చివరకు అనకూలంగా ఉంటుంది. ఆర్థికంగా సంతోషకరంగా ఉంటారు. వ్యాపారాలు లాభాలు వస్తాయి,. కుటుంబంలో శుభకార్యాలు. ఆఫీస్‌లో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆర్థికాభివృద్ధి. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీ, గణపతి ఆరాధన చేయండి.

మీనరాశి : ఈరోజు మంచిగా ఉంటుంది !

ఈరోజు మంచిగా ఉంటుంది. శుభకార్యాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఆఫీస్‌లో సంతోషం, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టమైన వ్యక్తులు మీ ఇంటికివచ్చే అవకాశం. అనుకోని చోట నుంచి శుభవార్తలు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. వైవాహికంగా బాగుంటుంది. శ్రీరామనామాన్ని జపించండి.

Advertisement