Horoscope : ఏప్రిల్ 3rd 2021 రాశిఫలాలు : అధిక లాభాలు కలుగుతాయి !

Tech Desk-2 - April 3, 2021 / 12:59 AM IST

Horoscope : ఏప్రిల్  3rd 2021 రాశిఫలాలు :  అధిక లాభాలు కలుగుతాయి !

మేష రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

Horoscope : ఈ రోజు బాగుంటుంది. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. ధనలాభం కలుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.  మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షలో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొండి.

వృషభరాశి: విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం ఏర్పడుతుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఆటంకాలు ఎదురైనా స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయాన్ని అశ్రద్ధ చేస్తారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల అవమానాలు కలుగుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

Horoscope today  april  3rd 2021 daily horoscope in telugu

Horoscope today april 3rd 2021 daily horoscope in telugu

మిధునరాశి: అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును మర్యాదను తిరిగి పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి: వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అందరికీ సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు తోటి స్నేహితులతో కలిసి చదువు విషయంలో తెలియని విషయాలను తెలుసుకుంటారు. కష్టపడి చదువుకుంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

సింహరాశి: నీటి సంబంధ అనారోగ్యాలు !

రోజా అనుకూలంగా లేదు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అయిన వారి నుంచి అవమానం పొందుతారు. తప్పు చేసే వారిని ప్రోత్సహించడం వల్ల నష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల మీ ప్రాణ స్నేహితులు మీకు దూరం అవుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపార వృద్ధిని కోల్పోతారు. కష్టాలు కలుగుతాయి. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. ప్రయాణ అనుకూలత కోల్పోతారు.
ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి స్వామివారికి వడలను నైవేద్యంగా నివేదించి బీదవారికి ప్రసాద వితరణ చేయండి.

కన్యారాశి: నూతన వ్యాపారాలు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. మీలో ఉన్న రహస్యాలను ఇతరులతో చెప్పడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆచార సంప్రదాయా లు పోగొట్టుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించడం పై అధికారుల ఒత్తిడికి గురవుతారు. నూతన వ్యాపారాలు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.

తులారాశి: అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార అనుకూలత కోల్పోతారు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. సమయానికి చేతిలో డబ్బులు అందవు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో గురించి దీర్ఘాలోచన చేస్తారు. ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

ధనస్సురాశి: పై అధికారుల మన్ననలు పొందుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు. తెలియని విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార వృద్ధి పెరుగుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పై అధికారుల మన్ననలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. మీకు ఉన్నసమస్యలను తల్లిదండ్రులకు చెప్పడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి: వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. మీలో ఉన్న చికాకు వల్ల స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేస్తారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి: విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. విద్యార్థుల స్నేహితులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని భారాన్ని మోస్తారు. మీరు అంటే ఏంటో నిరూపించుకుంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విహార యాత్రలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో పూర్తి కాని పనులను తిరిగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తపన. ఫలితాలు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహానికి కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us