Horoscope : ఏప్రిల్ 1st 2021 రాశిఫలాలు : బకాయిలు వసూలు !

Tech Desk-2 - April 1, 2021 / 03:00 AM IST

Horoscope  : ఏప్రిల్ 1st 2021 రాశిఫలాలు : బకాయిలు వసూలు !

మేష రాశి: వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

Horoscope : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. తొందరపడి ఎదుటివారికి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. ఈరోజు గణపతిని ఆరాధన చేయండి.

వృషభరాశి: వ్యాపారాల్లో అనుకూలత !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం. వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి: విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. గతంలో వసూలు కానీ బకాయిలను వసూలు చేసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనయోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: స్నేహితుల సహాయ సహకారాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. సోదరులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఈరోజు గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించండి.

సింహరాశి: శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. తెలియని కొత్త కొత్త విషయాలను పుస్తకాలు చదివి తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

Horoscope today april 1st 2021 daily horoscope in telugu

Horoscope today april 1st 2021 daily horoscope in telugu

కన్యారాశి: అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులతో అందరితో కలిసిమెలిసి సభ్యతగా ఉంటారు. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రుల రాక సంతోషపరుస్తుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామిని ఆరాధించండి.

తులారాశి: వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులం చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. మీలో ఉన్న రహస్యాలను, సమస్యలను ఇతరులకు చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధిక శ్రమ వల్ల ప్రమోషన్లు పొందుతారు. ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ధనలాభం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆయన వారితో, అందరితో కలిసిమెలిసి సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఇంక్రిమెంట్లు పొందుతారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి: ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల అవమానాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్థిరాస్తులను కోల్పోతారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. ఇంట్లో ఏదో ఒక వేడుకను జరుపుతారు. చిన్నప్పటి ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: వ్యాపారాల్లో అభివృద్ధి !

ఈ రోజా ఆనందకరంగా వుంటుంది. గతంలో పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ప్రయాణ లాభంతోపాటు ఆనందం లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. మితమైన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి: ఉన్నత వ్యక్తుల పరిచయాలు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థులు స్నేహితులతో కలిసిమెలిసి కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభ కార్యాలు అనుకూలిస్తాయి. సోదరుల మైత్రి కలుగుతుంది. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us