Connect with us

Latest News

చిన్నారుల పై అత్యాచారాల్లో ఎక్కువ శాతం తెలిసిన వారే.. ఎన్సిఆర్బి నివేదికలో వెల్లడి

Published

on

Share the News from here

ప్రస్తుత రోజుల్లో కొంతమంది కిరాతకులు అభంశుభం తెలియని బాలికల పై అత్యాచారాలు చేస్తున్నారు. ఇక ఇలా జరుగుతున్న అత్యాచారాల్లో చాలా తక్కువ మొత్తంలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2019 నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1180 అత్యాచార నేరాలు జరిగాయి. ఇక దింట్లో తెలిసినవారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. నిందితుల్లో తెలిసిన వారు 1177 మంది ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో 163 ఉన్నారు.

అలాగే అపరిచిత వ్యక్తులు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు వారి నుండి 350 మంది ఉన్నారు. అలాగే ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేసిన వారు 664 ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నివేదికలో 99.7 శాతం తెలిసిన వారే ఉన్నారని తెలిపారు.

ఇక అత్యాచారానికి గురయ్యిన బాలికల్లో..
ఆరేళ్ళ వయస్సులోపు బాలికలు 26,
6 నుండి 12 ఏళ్ళ బాలికలు 75,
12 నుండి 16 ఏళ్ళ బాలికలు 326,
16 నుండి 18 ఏళ్ళ బాలికలు 764 మంది ఉన్నారు.
ఇక మొత్తం బాధితుల సంఖ్య 1,191 మంది ఉన్నట్లు తెలిపారు.

ఇక ఈ అఘాయిత్యాల్లో బయటివారు తక్కువే ఉన్నారు. ఇక పరువు పోతుందని బయటకు రాని అత్యాచారాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని పేర్కొన్నారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!