Normal Delivery: నార్మల్ డెలివరీ.. సిజేరియన్ డెలివరీ.. ఏది మంచిది.. సిజేరియన్ డెలివరీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు

Normal Delivery నార్మల్ డెలివరీ అనేది తల్లీ, బిడ్దల మధ్య ఓక సంగమం. నెలలు నిండిన కొద్దీ బేబీ ఆ పొజిషషన్ లోకి వెళ్లి దానంతట అదే ఆ దారి తెచ్చుకుని అదే నొప్పులు క్రియేట్ చేసుకుని డెలివరీ అవుతుంది. తల్లీకి, బిడ్డకీ మధ్య కెమిస్ట్రీ క్రియేట్ అవ్వడం వల్లే సాధ్యమవుతుంది. నార్మల్ డెలివరీ చేసే సమయంలో వైద్యులు గర్భిణికి నొప్పులతో ఎక్కువగా బాధపడకుండా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. బ్లడ్ కూడా ఎక్కువగా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నార్మల్ డెలివరీ అంటే నొప్పులు అదంతట అదే వచ్చి డెలివరీ అవ్వడమే.

సిజేరియన్ చేయడానికి చాలా కారణాలుంటాయి. బిడ్డ తల పెద్దగా ఉండి పెల్విస్ చిన్నగా ఉంటే నార్మల్ డెలివరీ కాదు. బేబీ బరువు 4.5 కన్నా ఎక్కువగా ఉంటే.. తల కిందకి రాకపోతే సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో డయాబెటిస్ ఎక్కువైంది కాబట్టి.. బేబీ బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. హై బీపీ, హై షుగర్ తల్లికి ఎక్కువగా ఉంటే.. బిడ్డకు ఏదైనా సమస్యలు వస్తాయోమోననే అనుమానంతో కూడా సిజేరియన్ చేస్తారు. బ్లడ్ సరఫరాలో ఏదైనా సమస్యలు వచ్చినా, తల్లికి ఫిట్స్ లాంటి సమస్యలు ఉన్నా , సిజేరియన్ చేసే అవకాశం ఉంటుంది. బేబీ బరువు తక్కువగా ఉండి.. బేబీ నార్మల్ డెలివరీ తట్టుకునే పరిస్థితి లేకపోయినా.. సిజేరియన్ చేయాల్సి వస్తుంది.

ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సమస్య మొదటి సారి సిజేరియన్ అయి.. రెండోసారి డెలివరీ కోసం రావడం. వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ డెలివరీ ని ప్రొమోట్ చేస్తున్నారు వైద్యులు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నార్మల్ డెలివరీ మంచిదని వైద్యుల అభిప్రాయం. మొదటి సారి సిజేరియన్ అయ్యాక రెండోసారి డెలివరీకి గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మొదటిసారి ఏర్పడిన గాయం పూర్తిగా మానేందుకు సమయం ఇవ్వాలి. గాయం మానకపోతే డెలివరీ అనేది కష్టం.

మరో విషయం ఏమిటంటే పిల్లల్ని మంచి ముహూర్తంలోనే కనాలనే మూఢ నమ్మకంతో వైద్యుల మీద సిజేరియన్ చేయాలని ఒత్తిడి తెస్తుంటారు. ఇది కరెక్ట్ కాదని వైద్యులు అంటున్నారు.మొదటి సారి నార్మల్ డెలివరీ అయితే తర్వాత కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది తల్లీ బిడ్డకీ కూడా మంచిది. అదే మొదటి సారి ముహూర్తం కోసమని సిజేరియన్ చేపించుకుంటే రెండోసారి నార్మల్ డెలివరీ కావడమనేది జరగకపోవచ్చు. డాక్టర్లు ఎంత నార్మల్ డెలివరీ ని ప్రోత్సహించినా మూఢ నమ్మకాలతో ముహూర్తాలు పెట్టుకుని అదే సమయానికి నొప్పులు రాకపోతే సిజేరియన్ చేయమని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూఢనమ్మకాలను పక్కన పెట్టి నార్మల్ డెలివరీని ప్రోత్సహిస్తారో అప్పుడే నార్మల్ డెలివరీ రేటును పెంచవచ్చని వైద్యులు అంటున్నారు.

ఒక్క వైద్యులతోనే అన్ని జరిగిపోవు. ఇందులో తల్లి కూడా అంతే స్ఫూర్తితో ఉండాలి. మొదటి సారి సిజేరియన్ అయినా మూడేళ్లు గ్యాప్ ఉంది కాబట్టి నేను నార్మల్ డెలివరీ చేయించుకుంటానని పట్టుబట్టాలి. అప్పుడే ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ఆస్కారముంటుంది. నార్మల్ డెలివరీ తర్వాత సమస్యలుంటాయి. సిజేరియన్ డెలివరీ తర్వాత కూడా సమస్యలు వస్తాయి. అయితే సిజేరియన్ సమయంలో నొప్పి తెలియదు కాబ్టటిదాన్నే ఎంచుకోవడమనేది తప్పు. నార్మల్ డెలివరీలో ఆ సమయంలో మాత్రమే నొప్పులుంటాయి. అదే సిజేరియన్అంటే సర్జరీ కాబట్టి తర్వాత కూడా నొప్పి ఉంటుంది. సో.. ఎప్పటికైనా నార్మల్ డెలివరీ యే మంచిదని గుర్తించాలి.

Advertisement