America: ప్రపంచంలో వింత మనుషులు, వింత జంతువులు పుడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం. ఉండాల్సిన పార్ట్స్ కంటే ఎక్కువ పార్ట్స్ తో వీరు పుడుతుంటారు. రెండు తలలతో జన్మించిన మనుషులు, పశువులని కూడా చూశాం. కాని ఓ మహిళ రెండు సంతానోత్పత్తి వ్యవస్థలతో పుట్టి అందరిని ఆశ్చర్యపరచింది. మహిళకు రెండు గర్భాశయాలు, రెండు జననాంగాలు ఉండగా, 18 ఏళ్లు వచ్చే వరకు ఆమెకు ఆ విషయం తెలియలేదుట.
అమెరికాకు చెందిన పెయిజ్ డిఎంజెలో శరీరంలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. తరచుగా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుండడంతో ఆమె డాక్టర్‌ను కలవగా.. అసలు విషయం బయటపడింది. రెండు వేర్వేరు గర్భధారణ వ్యవస్థలు ఒకే శరీరంలో ఉండడం వలన ప్రతి రెండువారాలకు ఒకసారి పెయిజ్‌కు పీరియడ్స్ వస్తుండేవి.
18 ఏళ్ల వయస్సులో ఆ మహిళ గైనకాలజిస్ట్ దగ్గరకు వెలితే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తను ఉటెరెస్ డిడిల్పెజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ స్థితి వల్ల పెయిజ్‌కు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. పిల్లల్ని కనాలని అనుకుంటే ఆమెకు `సరోగసీ` విధానమే మేలని వైద్యులు చెబుతున్నారు.
- Advertisement -
పెయిజ్ తనకు ఎదురైన సమస్యల గురించి చెబుతూ నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. హైస్కూల్ జీవితం అంతా దుర్భరంగా నడిచింది. నా శృంగార జీవితం గురించి చాలా మందికి ఆత్రుత ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. నాకు లైంగిక ఇబ్బందులేవీ లేవు. బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.శృంగార విషయంలో అంతా సవ్యంగానే ఉంది. నాకు పిల్లలను కనాలని ఉంది.
ఇదే సమస్యతో బాధపడుతున్న కొందరు ఫేస్‌బుక్ ద్వారా నాకు పరిచయమయ్యారు. ఓ మహిళకు ఐదు గర్భస్రావాల తర్వాత.. ప్రసవం అయింది. నాలాంటి సమస్యతోనే బాధపడుతూ పిల్లలకు జన్మనిచ్చిన మహిళల గురించి వింటూ ఆశతో జీవిస్తున్నానని పెయిజ్ పేర్కొంది.