Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు గుండె పోటుకి కార‌ణం.. అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

NQ Staff - August 1, 2022 / 09:51 AM IST

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు గుండె పోటుకి కార‌ణం.. అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Heart Attack : ఈ రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే గుండె ప్ర‌మాదానికి గుర‌వుతున్నారు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ఇటీవ‌లి కాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మృత్యువాత చెందుతున్నార‌ని మ‌నం వింటున్నాం. కరోనా తర్వాత ఇలాంటి గుండెపోటు సమస్యలు అధికమయ్యాయంటూ పలు నివేదికలు కూడా చెబుతున్నాయి.

Heart Attack symptoms in telugu

Heart Attack symptoms in telugu

ఇవి పాటించండి..

ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా గుండెకు రక్త ప్రసరణ సరిగా కాకపోతే.. హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే,ఈ హార్ట్‌ఎటాక్‌ అంటే సడెన్ గా వస్తుంది అనుకుంటారు. కానీ, అది నిజంకాదట.

సరిగ్గా గమనిస్తే.. గుండె పోటు వచ్చే ముందు మన శరీరం కొన్ని సిగ్నల్స్‌ ఇస్తుందట. గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే ఎడమవైపు శరీరభాగాల్లో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు, ఎడమ చేయి నుంచి పైన దవడ వరకూ నొప్పి వస్తుండటం వంటివి కనిపిస్తాయి. చెమటలు విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని నీళ్లు తాగినా నోరు పొడిబారినట్లే ఉంటుంది. స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఛాతీ కూడా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వేధిస్తూ.. ఎంతకీ తగ్గకపోవటం కూడా అనుమానించాలంటున్నారు. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలుగా చెబుతున్నారు. గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు. ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఓట్స్, చేపలు, వెల్లుల్లి, పెసలు వంటి ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us