Banana : అరటి పండ్లు తింటే తొందరగా నిద్రపోతారా?
NQ Staff - July 30, 2022 / 02:06 PM IST

Banana : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకులు పరుగులుగా మారాయి. మారిన జీవన శైలిని బట్టి చాలా మందికి నిద్ర కరువు అవుతుంది. నిద్ర సమస్య అనేక జబ్బులు బారిన కూడా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువత , పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Health Tips with Banana
ఇలా చేస్తే మంచిది..
ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అరటి పండ్లలో సహజసిద్ధమైన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అరటి పండ్లలో ప్రోబయోటిక్స్ పెంచడంలో సహాయపడే ఎంజైములు ఉంటాయి. ప్రీబయోటిక్స్ తినడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు . ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.వ్యాయామం తర్వాత కోలుకోవడం కోసం చెర్రీస్ తీసుకుంటే మంచిది.
మోంట్‌మోరెన్సీ టార్ట్ చెర్రీ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు 14 రోజుల పాటు తాగితే రోజు నిద్రకంటే మరో 84 నిమిషాల పాటు ఎక్కువసేపు నిద్రపోగలరని ఒక అధ్యయనంలో తేలింది. మెలటోనిన్ ఉంటుంది. ఇది రాత్రిపూట పీనియల్ గ్రంథి ద్వారా విడుదలయ్యే హార్మోన్. ఇది మీకు మంచి రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుంది. దీనితో కూడిన బెర్రీలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.