Ferty 9 Fertility Center : పిల్లల కోసం పరితపించే దంపతులకు స్వాగతం..
Kondala Rao - March 10, 2021 / 07:58 PM IST

Ferty 9 Fertility Center : సంతానం లేనివారు ఇక ఎంత మాత్రం చింతించాల్సిన పనిలేదు. ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్ మీ కలల్ని సాకారం చేస్తుంది. పండంటి బిడ్డలు పుట్టే సలహాలు సూచనలు చికిత్సలు అందిస్తుంది. డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో పాతికేళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం గల హైలీ ప్రొఫెషనల్ డాక్టర్లు, గైనకాలజిస్టులతో తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ ఫెర్టిలిటీ సెంటర్ గా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఎంతో మంది దంపతుల సంతానలేమి సమస్యలకు చక్కని పరిష్కారం చూపింది. సికింద్రాబాద్, కూకట్ పల్లి, అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, కరీంనగర్, విజయవాడల్లో ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. త్వరలో వైజాగ్ లోనూ ప్రారంభించబోతున్నారు.

Ferty 9 Fertility Center : advanced-ivf-lab-inagurated-by-actress-kamna-jethmalani
అడ్వాన్స్ డ్ ఐవీఎఫ్ ల్యాబ్ ప్రారంభం
సికింద్రాబాద్ రైల్ నిలయానికి సమీపంలోని ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్ లో మార్చి పదో తేదీన అంటే ఇవాళ బుధవారం అడ్వాన్స్ డ్ ఐవీఎఫ్ ల్యాబ్ ని ప్రముఖ సినీ నటి కామ్నా జెఠ్మలానీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఎమోషనల్ గా అనిపిస్తోందని చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే.. ‘సంతానం వల్ల కలిగే సంతోషమే వేరు. ఆ విషయం స్వయంగా నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లిని కాబట్టి. మాతృత్వపు మాధుర్యమేంటో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎంత మంది పిల్లలున్నారనేది కాదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది ముఖ్యం. పిల్లలు పుడితే తల్లితోపాటు ఆ కుటుంబం మొత్తం ఆనందపడుతుంది. ఇలాంటి అద్భుతమైన సర్వీసుని ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్ మన సొసైటీకి అందిస్తోంది. ఈ రోజు నేను ఈ అడ్వాన్స్ డ్ ఐవీఎఫ్ ల్యాబ్ ని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ల్యాబ్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ పీపుల్ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. ఇక్కడ ఎంతో మంది లేడీ డాక్టర్లు ఉండటం ఉమెన్ ఎంపవర్మెంట్ కి అద్దం పడుతోంది. దేశంలో ఇంకా ఎంతో మంది సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్నందున ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్ ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇండియా మొత్తం విస్తరించాలని కోరుకుంటున్నాను. ఈ సెంటర్ లో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఉమెన్స్ మంత్ నిర్వహిస్తుండటం గొప్ప విషయం. ఇందులో భాగంగా మహిళలకు 30 రోజుల పాటు ఫ్రీగా ఫెర్టిలిటీ కన్సల్టేషన్ సర్వీసులు అందించనున్నారు’’ అని కామ్నా జెఠ్మలానీ వివరించారు.
భయపడకండి.. బాధపడకండి: Ferty 9 Fertility Center
అంతకుముందు డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ సంతానంలేనివారు భయపడొద్దని, బాధపడొద్దని చెప్పారు. మీ సమస్యేంటో తెలుసుకోవటానికి మా ఎక్స్ పర్ట్ లను సంప్రదించాలని సూచించారు. ఫెర్టి 9 ఫెర్టిలిటీ సెంటర్ క్వాలిటీలో రాజీపడబోదని హామీ ఇచ్చారు. నైతిక విలువలతో కూడిన పారదర్శక సేవలను అత్యుత్తమంగా అందిస్తామని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయిన్టెయిన్ చేస్తామని భరోసా ఇచ్చారు.