Apple : తొక్కే కదా.. యాపిల్ తొక్క ఇంట్రెస్టింగ్ విషయాలు

NQ Staff - September 12, 2022 / 09:59 AM IST

Apple : తొక్కే కదా.. యాపిల్ తొక్క ఇంట్రెస్టింగ్ విషయాలు

Apple : ఆరోగ్యానికి మంచి ఫ్రూట్స్ ఏంటీ అంటే చాలా మంది వెంటనే చెప్పే పేర్లలో యాపిల్ ఉంటుంది. ప్రతి రోజు యాపిల్ ని తింటే వైద్యుల నుండి దూరంగా ఉండవచ్చు అనేది పెద్దల మాట. అంటే అనారోగ్యం బారిన పడటం తక్కువగా ఉంటుంది అనేది దాని అర్థం.

eat an apple with or without its peel

eat an apple with or without its peel

యాపిల్ ని చాలా మంది అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తక్కువ తిన్నా కూడా ఎక్కువ శాతం ఎనర్జీని యాపిల్ ఇస్తుంది అనేది నిపుణుల మరియు వైద్యుల యొక్క అభిప్రాయం.

అందుకే యాపిల్స్ ను అన్ని రకాల వారు.. అన్ని వర్గాల వారు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే యాపిల్ ని తినే విధానం గురించి రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. వాటి విషయంలో అవగాహణ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

కొందరు యాపిల్స్ ని పై తొక్క తీసి తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు యాపిల్‌ పొట్టు తీసి వారికి తినడానికి ఈజీగా ఉండేలా పెడతారు. కానీ అసలు విషయం ఏంటీ అంటే యాపిల్‌ పొట్టులో అద్భుతమైన మంచి గుణాలు ఉంటాయి.

యాపిల్‌ తొక్కలో ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది. శరీరానికి ఫైబర్ చాలా ఉపయోగదాయకం. మెటబాలిజం ను మెరుగు పర్చడంతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. అందుకే యాపిల్ తొక్కని తొలగించకుండానే తినాలి.

అయితే యాపిల్ లు నాణ్యంగా కనిపించడం కోసం కెమికల్స్ వాడే అవకాశం ఉంది. అందుకే గోరు వెచ్చని వేడి నీటిలో యాపిల్స్ ను కొద్ది సమయం ఉంచి ఆ తర్వాత బాగా కడిగి అప్పుడు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక ఇక నుండి తొక్కే కదా అని తీసేయకండి.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us