Malabar Spinach : బ‌చ్చలి కూర బంగారంతో స‌మానం.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటే..!

NQ Staff - August 4, 2022 / 10:04 AM IST

Malabar Spinach : బ‌చ్చలి కూర బంగారంతో స‌మానం.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటే..!

Malabar Spinach : అంద‌రికి అందుబాటులో ఉండే ఆకు కూర‌ల‌లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. దీనిని ర‌క‌ర‌కాలుగా తిన‌వ‌చ్చు. బ‌చ్చ‌లి కూర‌లో బోలెడ‌న్ని పోష‌కాలు ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌,లేదా ప‌ప్పులా చేసుకు తిన‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర వ‌ల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Benifits of Malabar Spinach and health tips

Benifits of Malabar Spinach and health tips

చాలా ఉప‌యోగాలు…

ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది.

హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకుని తాగుతుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి.

మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us