Artificial insemination in Animals: పశువుల్లో కృతిమ గర్భధారణ వల్ల కలిగే ఉపయోగాలు, జాగ్రత్తలు ఇవే..

NQ Staff - April 22, 2022 / 11:49 AM IST

Artificial insemination in Animals: పశువుల్లో కృతిమ గర్భధారణ వల్ల కలిగే ఉపయోగాలు, జాగ్రత్తలు ఇవే..

Artificial insemination in Animals:పశువుల పెంపకం చేసే వారికి కృతిమ గర్భదారణ అంటే ఇట్టే ఈజీగా తెలిసిపోతుంది. మన వద్ద ఉన్న ఆవులు లేదా గేదెలకు మేలు జాతి ఆంబోతుల వీర్యాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడాన్ని కృతిమ గర్భదారణ అని పిలుస్తారు. కృతిమ గర్భదారణ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన వద్ద లేని మేలు జాతి ఆంబోతుల వీర్యం కూడా ఈ పద్ధతిలో మన పశువులకు ఎక్కించబడుతుంది.

ఈ కృతిమ గర్భదారణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని రకాల దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కావున కృతిమ గర్భదారణ పద్ధతిలో మన వద్ద ఉన్న ఆవులకు కానీ గేదెలకు కానీ గర్భదారణ చేయించే సమయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా కాకుండా లైట్ తీసుకుంటే ఆ ఆవు లేదా గేదె మేలు జాతి దూడలకు జన్మనివ్వడం అనేది పక్కన పెడితే ఆ గేదె లేదా ఆవు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కావున చాలా కేర్ తీసుకోవాలి.

కృతిమ గర్భదారణ చేయించే సమయంలో చాలా ముఖ్యమైన విషయం… మనం గర్భదారణ చేయించాలని అనుకుంటున్న ఆవు లేదా గేదె ఎదకు వచ్చిందా అని తెలుసుకోవడం. ఒక వేళ ఎదకు రాకుండా ఈ ఇంజెక్షన్ వేయిస్తే ఆ పశువుల జ్ఞానేంద్రియాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతిమ గర్భదారణ వలన మరొక దుష్ప్రయోజనం కూడా ఉంది. ఇలా కృతిమ గర్భదారణ చేయించడం వలన మేలు జాతి ఎద్దులు లేదా ఆంబోతులకు మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గిపోతుంది.

ఈ పద్ధతి అందుబాటులో లేకపోతే వాటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మేలు జాతి పశువులతో ఎక్కువ అవసరం లేకుండా పోయింది. ఇలా కృతిమ గర్భదారణ చేయించడం వలన ఆ ఆవు లేదా గేదె చాలా ఎక్కువ పాలిస్తుంది. చాలా రకాల మేలు జాతి పశువులు అభివృద్ధి చెందుతాయి.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us