Telangana : ప్రజలకు ఊరట కలిగించే వార్త.. కోలుకుంటున్న తెలంగాణ..

Kondala Rao - May 8, 2021 / 09:06 PM IST

Telangana : ప్రజలకు ఊరట కలిగించే వార్త.. కోలుకుంటున్న తెలంగాణ..

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాస్త ఊరట కలిగించే వార్తను వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ శనివారం సాయంత్రం వెల్లడించింది. ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. వారం రోజుల కిందట దాక కూడా నిత్యం కనీసం ఎనిమిది వేల చిల్లర కేసులు నమోదవగా అవి ఇప్పుడు ఐదు వేలకు దిగొచ్చాయి. తాజా కేసుల సంఖ్య 5,186 మాత్రమే. గడచిన 24 గంటల్లో 38 మంది మాత్రమే ప్రాణాలను కోల్పోయారు. రోజుకి 50 మందికి పైగా చనిపోయేవారు. కొవిడ్ సోకటం వల్ల వివిధ ఆస్పత్రుల్లో చేరి ట్రీట్మెంట్ పొందుతూ కోలుకున్న సుమారు ఎనిమిది వేల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. కరోనా అప్డేటెడ్ డేటాను నిన్న శుక్రవారం వరకు ఉదయం పూట వెల్లడించిన అధికారులు ఇవాళ్టి నుంచి సాయంత్రం రిలీజ్ చేయటం ప్రారంభించారు.

telangana-relief-news-for-telangana-people

telangana-relief-news-for-telangana-people

దాదాపు 70 వేలు..

ఇవాళ ఒక్క రోజే 69,148 మందికి కొవిడ్-19 టెస్టులు చేసినట్లు ఆఫీసర్లు కొద్దిసేపటి కిందట విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద కోటీ 35 లక్షల 57 వేల 646 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో కరోనా నిర్ధారణ అయింది 4 లక్షల 92 వేల 385 మందికి. మహమ్మారి బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4 లక్షల 21 వేల 219 మంది. యాక్టివ్ కేసులు 68 వేల 462. చనిపోయినవారు 2 వేల 704. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలు.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి. అతి తక్కువ కేసులు వస్తున్న జిల్లాలు.. కొమురం భీం ఆసిఫాబాద్, నారాయణపేట.

ఆయువు పోస్తాం : Telangana

హాస్పిటల్స్ కి ప్రాణవాయువును ఫ్రీగా ఇచ్చేందుకు హైదరాబాద్ లోని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కంపెనీ ముందుకొచ్చింది. ‘‘వివిధ ఆస్పత్రులు నిత్యం 500 సిలిండర్లు కావాలంటున్నాయి. డీఆర్డీవోతో కలిసి 40 ఆక్సీజన్ ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నాం. ఒక్క కేంద్రం నుంచి నిమిషానికి 150-1,000 లీటర్ల ప్రాణవాయువును ఉత్పత్తి చేయొచ్చు’’ అని పేర్కొంది. భద్రాచలంలోని ఐటీసీ నుంచి, స్పెయిన్ దేశం నుంచి క్రయోజనిక్ ఆక్సీజన్ దిగుమతికి సైతం అంగీకారం తెలిపింది. క్రయోజనిక్ ఆక్సీజన్ ట్యాంకుల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది.

Megha Engineering Infrastructure Limited (MEIL)

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us