Health Tips: ఎండాకాలంలో ఆహార అలవాట్లు..

Admin - May 12, 2021 / 10:15 AM IST

Health Tips: ఎండాకాలంలో ఆహార అలవాట్లు..

Health Tips కాలం మారుతుంది. దానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎండాకాలంలో మరింత జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్య డీహైడ్రేషన్. దాన్ని అధిగమించాలంటే ఆహార పదార్థాలలో మార్పులు రావాలి. అవేంటో చూద్దాం.

1. వేడి పదార్థాలు

వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ అవుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ లు, టీ లు తగ్గించాలి.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి తేమని కోల్పోతుంది..

2.ఆయిల్ ఫుడ్స్

ఎండాకాలంలో నూనె లో వేయించిన ఆహారాలు పకోడీ, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వేపుల్లు తగ్గించాలి. జంక్ ఫుడ్ తింటే వచ్చే కెలోరీల వల్ల అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటిని తీసుకోకూడదు.. వాంతి చేయడం, లేదా అధికంగా దాహం వేస్తుంది.

3.కారాలు, మసాలాలు

వేసవిలో తీసుకునే ఆహారంలో కారాలు, మసాలాలు తగ్గించాలి. అవి శరీరంలో వేడి ని పెంచి, లైఫ్ స్పాన్ ను తగ్గిస్తుంది.

4. మాంసాహారం

మాంసాహారం కూడా ఎక్కువగా తినకూడదు. ఈ కాలంలో జీర్ణ సంబందిత సమస్యలు ఎదురవుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

1. పండ్లు

ఫ్రూట్స్ తినడం వల్ల డీహైడ్రేషన్ కు గురవ్వకుండా ఉంటారు. అవి కూడా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు మాత్రమే. పుచ్చకాయలో 91 శాతం నీరే ఉంటుంది. నిమ్మకాయ, కమలా పండ్లు, బత్తాయి పండ్లు తీసుకుంటే శరీరం లో నీటి శాతం పెరిగి వేడిని తగ్గిస్తుంది.

2.కొబ్బరి నీళ్లు

కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులో పొటాషియం క్యాల్షియం మెగ్నీషియం కలిగి ఉంటుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది.

3.సబ్జా గింజలు

సబ్జా గింజలను నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరము హైడ్రేట్ అవుతుంది. ఇది వాంతులను విరోచనాలను తగ్గిస్తుంది.ఇవి రక్త కణాలను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

4.మజ్జిగ/లస్సి

ఎండకాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. మజ్జిగ ఇష్టంలేని వాళ్ళు లస్సి కూడా తీసుకోవచ్చు..ఇందులో బయో ఆక్టివ్ ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. తరచూ మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us