Mosquito Prevention : విజృంభిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్స్.. దోమ‌ల‌కు ఇలా చెక్ పెట్టండి..!

NQ Staff - July 13, 2022 / 11:34 AM IST

Mosquito Prevention : విజృంభిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్స్.. దోమ‌ల‌కు ఇలా చెక్ పెట్టండి..!

Mosquito Prevention : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే వైర‌ల్ ఫీవ‌ర్స్ విజృంబ‌ణ కొన‌సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో దోమ‌లు, ఈగ‌ల వ‌ల్ల‌నే వైర‌ల్ ఫీవ‌ర్స్ ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వాటికి చెక్ పెట్టేందుకు కొంద‌రు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. దోమల నివారణకు రిఫెల్లెంట్స్ , దోమల నెట్లు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా వాటినుంచి తప్పించుకోవడం కష్టంగా మారుతుంటుంది..

ఇలా చేయండి..

Some Tips Mosquito Prevention

Some Tips Mosquito Prevention

దోమల పెరుగుదలకు చుట్టుపక్కల పరిసరాలు, పరిశుభ్రత కూడా కారణమవుతుంటాయి. అందుకే చుట్టుపక్కల చెత్తా చెదారం లేకుండా, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొన్ని రకాల దోమ కాటు వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణకు అనేక చిట్కాలు కూడా ప్రయోగిస్తుంటారు.

వాటిల్లో సమర్ధవంతంగా పని చేసేది కాఫీపొడి.. ఒక మట్టిపాత్రలో నిప్పులు తీసుకుని అందులో ఒకటి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ చల్లితే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లంతా వ్యాప్తి చెందేలా చేయాలి. దాంతో దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. కాఫీ పొడి వాసన దోమలకు, ఇతర కీటకాలకు పడదు.. ఎండబెట్టిన వేపాకులు, వెల్లుల్లి పొట్టు కూడా దోమల నివారణకు ఉపయోగిస్తుంటారు.

Some Tips Mosquito Prevention

Some Tips Mosquito Prevention

దొమ‌ల నివార‌ణ‌కు ముఖ్యంగా మ‌నం చేయ‌వ‌ల‌సింది ఏంటంటే మ‌న ప‌రిస‌రాల‌ని శుభ్రంగా ఉంచుకోవ‌డం. ప్రతి రోజు చెత్త బుట్టను క్లీన్ చేయడం, బాత్ రూములు, సింకులు శుభ్రంగా వేడినీటితో కడగడం, తడి బట్టలు లేకుండా చూసుకోవడం, సాయింత్ర సమయాల్లో ఇంట్లో సాంబ్రాణి పొగ లేదా కాఫీ పొడి వేయడం వంటివి చేస్తుండాలి.. నిద్రించేముందు ఒంటికి వేపనూనె, కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకోవాలి.

దీంతో దోమలు కుట్టకుండా కొంతవరకు శరీరాన్ని కాపాడుకోవచ్చు. మీకు ఉన్న స్థలంలోనే కొన్ని కుండీలు ఏర్పాటు చేసుకుని అందులో తులసిమొక్క, గుల్ మెంహందీ మొక్క, పుదీనా, బంతిమొక్క, నిమ్మగడ్డి మొక్క వేసుకుంటే వాటి వాసనకు దోమలు రాకుండా ఉంటాయి. ఈ మొక్కల ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను రాకుండా దూరం చేస్తాయి. ఇలా చేయ‌డం వ‌ల‌న వ‌ర్షాకాలంలో కాస్త దోమ‌లు, ఈగ‌ల బెడ‌ద నుండి త‌ప్పించుకోవ‌చ్చు.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us