Skinless Chicken : స్కిన్ లెస్ చికెన్ తెగ తినేస్తున్నారా? అయితే అంతే ఇక
NQ Staff - August 29, 2022 / 04:14 PM IST

Skinless Chicken : నాన్ వెజ్ లవర్స్ కి చికెన్ మీదుండే ఇష్టం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సండే అయినా, ఏ రేంజ్ ఫంక్షనయినా, పార్టీ అయినా చికెన్ పక్కా ఉండాల్సిందే. మనదగ్గరనే కాదు.. వరల్డ్ వైడ్ గా ఎక్కువగా తినే మాంసం చికెనే. 2021 లో ప్రపంంచ వ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల చికెన్ మాంసాన్ని వినియోగించినట్టుఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది.
ఇండియాలో ఈ వాడకం 41 లక్షల టన్నుల కన్నా ఎక్కువగానే ఉంటుంది. అందుబాటు ధరల్లో ఉండడం, తక్కువ ఫ్యాట్ ఉండడంతో చాలా మంది చికెన్ నే ప్రిఫర్ చేస్తుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా ఉండడంతో హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు కూడా చికెన్ ని లైక్ చేస్తారు.
అయితే ఇదే చికెన్ పై జనాల్లో కొన్ని అనుమానాలు,

Skinless Chicken High in Fat
అపోహలు కూడా లేకపోలేదు. చికెన్ స్కిన్ లెస్ లో ఎక్కవగా కొవ్వు ఉంటుంది. కాబట్టి చికెన్ స్కిన్ తో పాటు తినడం మంచిదేనా? లేక వండేటప్పుడు తీసేయాలా? అన్నది మేజర్ డౌట్.
నిజానికి చికెన్ స్కిన్ లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే మనం 100 గ్రాముల చికెన్ స్కిన్ తింటే అందులో 32 గ్రాముల కొవ్వు ఉంటుంది. చికెన్ స్కిన్ లో ఉండే ఈ కొవ్వులో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వులుంటాయి. వీటిని మంచి కొవ్వు అని కూడా అంటారు. ఇది రక్తంలో కొలెస్టాలో స్టాయి మెరుగు పడడానికి హెల్ప్ అవుతుంది.
అలా అని స్కిన్ తోనే చికెన్ తినేయాలని కాదండోయ్. వండేప్పుడు స్కిన్ అలానే ఉంచి తినేముందు తీసేస్తే మంచింది. వండేప్పుడు ఉండడం వల్ల కూరకు తగిన రుచి, ఫ్లేమర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. సో.. నాన్ వెజ్ లవర్స్. చికెన్ స్కిన్ తో అయితే ఒచ్చే ప్రాబ్లమేమీ లేదు. లెట్స్ ఎంజాయ్. ఈ న్యూస్ తెలిసిన హ్యాపీనెస్ లో ఇంకో రెండు ముక్కలెక్కువే లాగించేయండి మరి.