భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ. వ్యాక్సిన్ అప్పుడే రానుందట..!

ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు భారత్ బయోటెక్ ను సందర్శించాడు. అయితే కరోనా ను నివారించే వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. దింట్లో భాగంగా హైదరాబాద్ ‌లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్‌ లోని జైడస్ బయోటిక్ పార్క్, పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ‌లను మోడీ సందర్శించాడు. ఇక హైదరాబాద్ లోని జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్ ను సందర్శించి, వారు తయారు చేస్తున్న కొవ్యాక్సిన్ ను పరిశీలించారు.

పరిశీలన తరువాత పరిశోధకులతో సమావేశం అయి వ్యాక్సిన్ పురోగతిని అడిగి తెలుసుకున్నాడు. అయితే ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ లో ఉంది. అయితే భారత్ లో తయారు చేస్తున్న మొట్టమొదటి కొవ్యాక్సిన్ కావడంతో ప్రధాని నేరుగా వచ్చి పరిశీలించారు. వ్యాక్సిన్ కీలక దశలో ఉన్నందున ఆ సవాళ్ళను పరిశోధకులు ఎలా ఎదుర్కుంటున్నారో అని స్వయంగా ఆయనే పర్యటించారు.

ఇక ఈ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ రూపొందిస్తుండగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఇక మొత్తానికి ప్రధాని పరిశీలనతో వ్యాక్సిన్ విడుదల దగ్గర్లో ఉందని భావిస్తున్నారు. ట్రయల్స్ అన్ని పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ వ్యాక్సిన్ బయటకు వస్తే భారత్ కూడా కరోనా ను ఎదుర్కోవడంలో ఒక అడుగు ముందుకేసిన దేశాల్లో ఒకటిగా నిలువనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Advertisement
Advertisement