COVID: కరోనా వైరస్ కి సంబంధించి.. అందరూ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు..

Admin - May 11, 2021 / 06:15 PM IST

COVID: కరోనా వైరస్ కి సంబంధించి.. అందరూ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు..

COVID: కొవిడ్ ట్రీట్మెంట్ కు సంబందించిన కొన్ని ముఖ్యవిషయాలు:

మొత్తం కొవిడ్ పేషెంట్లు వందమంది ఉంటే, వారిలోజబ్బు తీవ్రత ఎంతమందిలో ఎలా ఉంటుంది అంటే

No Symptoms – 20%

Mild Covid – 70% %

Moderate Covid – 7%

Severe Covid – 3 %

A) No Symptoms: సుమారు 20 శాతం మందికి

అసలు వారికి కరోనా వచ్చిపోయిందనే విషయం కూడాతెలియదు. కేవలం ఆంటీబాడీడీ పరీక్షల ఆధారంగా వారికి

గత 6 నెలలలో కొవిడ్ ఎప్పుడో వచ్చిపోయిందనిడాక్టర్లు చెబితే తెలుస్తుంది తప్పితే, కనీసం చిన్నపాటిజలుబు, జ్వరం వచ్చినట్టు కూడా వారికి తెలియదు.

B) Mild Covid (ఆక్సిజన్ శాతం ఎప్పుడూ 95శాతం కన్నా తగ్గదు):

* 70% మందికి దగ్గు,జలుబు, జ్వరం వంటి MILDSymptoms మాత్రమే ఉంటాయి.

* వీరికి అన్నిటికంటే ముఖ్యమైనది Hydration – నీరు,మజ్జిగ, ఎలక్ట్రాల్ వంటి ద్రవ పదార్థాలు సమృద్ధిగా తీసుకోవాలి.

*దగ్గు బాగా ఉంటే (ముఖ్యంగా పెద్ద వారికి, దీర్ఘకాలికజబ్బులున్న వారికీ) Budesinide Inhaler 800 microgmDocãodveroRotahaler/ Lupihaler/Revoliser వంటి పరికరాల సాయంతో ఒక వారంపీల్చుకుంటే కొంత ఉపయోగం ఉండొచ్చు.

* లక్షణాలను బట్టి మందులు వాడతారు. జ్వరానికి -జ్వరం మందు,జలుబుకు -జలుబు మందు, వొళ్లునెప్పులకు పారసిట్మాల్ 650 mg వంటివి వాడతారు.ముక్కులు కారుతుంటే cetrizineవంటివి వాడవచ్చు.

* Ivermectin 12 mg SoeisuosveuBueu చేస్తాయని కొంతమంది నమ్మకం.

* అవసరాన్ని బట్టి బలం మాత్రలు, గ్యాసు మాత్రలువాడుకోవచ్చు.

* అపరిమితంగా సి విటమిన్ వాడటం వల్ల కిడ్నీలోరాళ్లు, జింక్ మాత్రలు వాడటం వల్ల గాస్ట్రైటిస్ రావడంతప్పించి పెద్ద ఉపయోగం ఉండదు.

* *Mild Covid పేషెంట్లకి,జబ్బు లక్షణాలు మొదలైనమొదటి వారంలో స్టిరాయిడ్ మందులు(Dexamethasone, Methyl prednisolone,Prednisolone) ఎట్టి పరిస్థితులలోనూ వాడరాదు.*

* వీరి జబ్బు లక్షణాలు ఎక్కువమందికి వారంలోపేతగ్గిపోతాయి.

* సాధారణంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు.ఇంటిలోనే ఒక పల్స్ ఆక్సీమీటరుతో, ఒక సహాయకుడి

సహాయంతో, డాక్టరు పర్యవేక్షణలో వైద్యంపొందవచ్చును.

*వీరికి రెమిడిసివీర్ అస్సలు అవసరం లేదు*

* వీరిలో కొంతమంది Moderate / Severe కొవిడ్ కుprogress అవుతారు. కనుక, వీరి జబ్బు లక్షణాలు,ఆక్సిజన్ శాతం రోజూ మూడు పూటలా, 6నిమిషాలనడక తర్వాత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.

* వీరిలో ఎక్కువ శాతం మందికి ఏ రక్త పరీక్షలు, ఛాతిసిటీ స్కాను అవసరం లేదు. (Sugar, Hemogram, CRP, Urine analysis వంటి సాధారణ పరీక్షలుచేయించుకుంటే మంచిది)

# వీరిలో 40 సంవత్సరాలు దాటిన వారికి, ఊబకాయంఉన్నవారికి, పొగాకు – మందు వంటి అలవాట్లుఉన్నవారికీ దీర్ఘకాలిక జబ్బులేమన్నా ఉన్నాయేమో ఈక్రింద పరీక్షల ద్వారా తెలుసుకొంటే మంచిది.

షుగరు (RBS)

కిడ్నీ (Creatine, Urine)

లివరు (Bilirubin, SGPT, ALP)

హార్టు (ECG)

ఊపిరితిత్తులు (CXR PA)

థైరాయిడ్ (TSH)

ఇమ్యూనిటీ లోపం (HIV)

రక్త కణాలు (Hemogram)

క్రొవ్వు పదార్థాలు(Lipids)

కొవిడ్ తీవ్రత (CRP, D dimer)

*మొత్తం వంద మంది కొవిడ్ పేషెంట్లలో 10% మందికిమాత్రమే Moderate, Severe తీవ్రతకు జబ్బుముదిరిపోతుంది. ఎక్కువ మంది ఈ స్టేజికి జబ్బులక్షణాలు మొదలైన రెండో వారానికి (Day 7 to Day14మధ్య) వెళతారు. ఎవరన్నా ఒకరికి, కొంచం తొందరగాగానీ (Day 5) లేదా ఆలస్యంగా గానీ (Between Day15 to 21) కూడా జబ్బు తీవ్ర రూపం దాల్చవచ్చును.*

Day 1 ఎప్పుడు అనే నిర్థారణ పేషంట్ చెప్పిన హిస్టరీ నిబట్టే డాక్టర్ నిర్ణయిస్తారు. కావున mild symptomsకూడా మర్చిపోకుండా మన డాక్టర్ కి చెప్పవలసినబాధ్యత మనదే.

C)Moderate Covid (ఆక్సిజన్ శాతం 90 – 94%మధ్య) :

వీరికి ఛాతీ సిటీ స్కాను చేసి వెంటనేహాస్పిటల్లో అడ్మిట్ చేయాలి/ లేక స్పెషలిస్ట్ డాక్టరుšestereso Hemogram, CRP, IL6, Ferritin, Ddimer వంటి పరీక్షలు చేసి జబ్బు తీవ్రత అంచనావేయాలి. అవసరాన్ని బట్టి పై పరీక్షలు ప్రతి 48గంటలకొకసారీ చేసుకొని, ఆ రిపోర్టులకనుగుణంగామందుల డోసులు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి.*Severe Covid లోకి పేషెంటు వెళ్లకుండా ఆపేప్రయత్నం చేయాలి.*

*జబ్బు తీవ్రతను అదుపులో పెట్టడానికి అవసరమైనస్టిరాయిడ్ (Methyl prednisolone 16 mg నుండి125 mg వరకూ 2 పూటలా ఇవ్వాలి. ఎంత తీవ్రదశలో వస్తే అంత ఎక్కువ డోసు వాడాలి.ఒక్కసారి స్టిరాయిడ్స్ దలుపెడితే, వాటిని కనీసం10 నుండి 20 రోజులు వాడాలి. ఆక్సిజన్ శాతం, రక్తపరీక్షలు కనీసం 15% మెరుగవ్వకుండా స్టిరాయిడ్ డోసుతగ్గించరాదు.తక్కువ డోసుతోనే (MP 16 mg BD) జబ్బుఅదుపులోకి వచ్చిన వారికి,డోసు నిదానంగాతగ్గించాల్సిన పని లేదు. అవసరాన్ని బట్టి 2-3 వారాలువాడి తరువాత మందులు డోసు తగ్గించుకుంటూ

మానేయవచ్చు. ఈ ట్రీట్మెంట్ డాక్టరు పర్యవేక్షణ లోనేజరగాలి.పేషెంట్లకి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమేఅందించాలి. (Target :: Ward: 92 to 94% ; ICU: 90-92% ; ఊపిరితిత్తులు పాడయిపోయిన COPDవారికి : 88-90% మెయింటైన్ చేస్తే చాలు ; *( పల్స్ఆక్సీ మీటరులో ఆక్సిజన్ శాతం 98 – 100% అయ్యేంతఎక్కువ ఆక్సిజన్ పేషెంటుకి ఇవ్వటం మంచిది కాదు)*

Enoxaparin (LMWH) 40 microgmమొదలుపెట్టాలి. D dimer ఎక్కువ ఉన్నా, పెరుగుతూఉన్నా దీనిడోసు ఇంకా పెంచాలి.డోసు కొంచెం తక్కువఇస్తే, రక్తనాళాలు మూసుకుపోవచ్చు -డోసు కొంచెంఎక్కువ అయితే, శరీరంలో ఎక్కడైనా రక్తస్రావంఅవ్వవచ్చు. కొవిడ్ కొత్త జబ్బు కనుక, కరెక్ట్ డోసు ఎంతఇవ్వాలి అనే మార్గదర్శకాలు లేవు. వైద్యం చేసే డాక్టరుగారు తన అనుభవంతో, పేషెంటు ఆరోగ్య పరిస్థితి, Ddimer పరీక్ష వాల్యూ రెగ్యులర్ గా చూసుకుంటూ డోసుపెంచాలా – తగ్గించాలా అనేది నిర్ధారిస్తారు.

*రెమిడిసివీర్:*

*డాక్టరుకు ముందు నుండి క్రమం తప్పకుండాచూపించుకుంటూ ఉండి, కరెక్టుగా ఆక్సిజన్ 93 – 94శాతానికి పడటం మొదలవగానే గుర్తించిన పేషెంట్లకి,అందుబాటులో ఉంటే రెమిడిసివీర్ ఇంజక్షన్ఇవ్వవచ్చు.దానివలన వారు తక్కువ రోజులలోనేకోలుకునే అవకాశం ఉంది.*

* రెమిడిసివీర్ కేవలం హాస్పిటల్లో ఉండే రోజులసంఖ్యను మాత్రమే తగ్గిస్తుంది. రెమిడిసివీర్ కు ప్రాణంపోకుండా కాపాడే శక్తి లేదు.

* రెమిడిసివీర్ కేవలం మొదటి వారంలో ఇస్తేనేమంచిది.జబ్బు లక్షణాలు మొదలయిన పది రోజులకు,వొంటిలో నుండి వైరస్ పోతుంది. (Rapid antigenగొంతు టెస్టు నెగిటివ్ వస్తుంది). కనుక Antiviral drugఅయిన *రెమిడిసివీర్ ను జబ్బు లక్షణాలు మొదలైనపదోరోజుల తరువాత ఇవ్వటం వలన అస్సలుఉపయోగం లేదు (వైరస్సే ఉండదు కనుక).*

*జబ్బు తీవ్రంగా (Severe Covid) ఉండి (90% కన్నాతక్కువ), వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తున్న

వారికి రెమిడిసివీర్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు.*

*కిడ్నీ, లివరు దెబ్బతిన్నవారికీ రెమిడిసివీర్ ఇవ్వలేము(Rising creatine, SGPT ఐదు రెట్లు పెరిగినా)

*మొత్తంగా చూసుకుంటే, వందమంది కొవిడ్ పేషెంట్లుఉంటే, పట్టుమని పది మందికి కూడా రెమిడిసివీర్ వల్ల ఉపయోగం లేదఅంతేగానీ, అది దొరకకపోతే ప్రాణాలే పోయినట్టుఆందోళన చెందటం గానీ, లక్షలు ఖర్చుపెట్టి బ్లాక్ మార్కెట్లో కొనటంగానీ చేయాల్సినంత గొప్ప మందేమికాదు. అది కేవలం హాస్పిటల్లో ఉండే రోజుల సంఖ్యను మాత్రమే తగ్గిస్తుంది – పోయే ప్రాణాలను ఆపేంత గొప్పశక్తేమీ ఆ మందుకి లేదు.

D)Moderate Covid పేషెంట్లు కొంతమంది”Severe Covid” కు ప్రోగ్రెస్ అవుతారు (5%): ఆక్సిజన్శాతం 90 శాతం కన్నా పడిపోతుంది.

* అవసరమైతే మరలా మరలా ఛాతి సిటీ స్కానుచేయాలి. ఆ తీవ్రతను అదుపులో పెట్టడానికి మంచిఇంజక్షన్ స్టిరాయిడ్ మందులు ఎక్కువ డోసులోప్రయత్నించాలి.

*జబ్బు అప్పటికీ లొంగక వెంటిలేటరు పెట్టవలసినపరిస్థితి వస్తే, ఆఖరి ప్రయత్నంగా Tocilizamabవంటిమందులు ప్రయత్నించవచ్చు. ఈ స్టేజీలో నుండికొద్దిమందీ మాత్రమే రికవరు అవుతున్నారు.

*ప్రాథమిక దశలో జబ్బు లక్షణాలను అశ్రద్ధ చేసి,చాలామంది (ముఖ్యంగా యువకులు) డైరెక్ట్ గా తీవ్ర స్టేజీలో(Severe) ప్రాణాపాయ స్థితిలో డాక్టరునుకలుస్తున్నారు. ఆ పరిస్థితిలో జబ్బు మందులకురెస్పాండ్ అవటం లేదు. కొన్ని గంటల వ్యవధిలోనే,వేగంగా ముదిరిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.*

ఈ సీజనులో వొంట్లో ఎవరికి ఎక్కడ, ఏ ఇబ్బందివచ్చినా 99% అవి కొవిడ్ వల్లనే.చాలామందిటైఫాయిడ్ అనుకొని సొంత వైద్యాలు చేసుకొని జబ్బుముదరబెట్టుకుంటున్నారు.

*కనుక ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది వచ్చినా వెంటనేడాక్టరుని కలిసి కొవిడ్ ముక్కు స్వాబు పరీక్షచేయించుకొని మందులు వాడుకోవాలి.* జబ్బులక్షణాలు మొదలయ్యాక ఎంత ఆలస్యంగా డాక్టరునికలిస్తే, అంత ఎక్కువ ప్రాణాలు కోల్పోయే ప్రమాదంఉంది.ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు – చిన్ననీరసం, వికారం,విరోచనాలు వంటివి ఉన్నాసరే వెంటనేడాక్టరుని కలవాలి. చూపించుకోవటంలో ఒకటి రెండురోజులు ఆలస్యం చేసినా ఒక్కసారి జబ్బు వైద్యానికిలొంగే స్టేజీ దాటిపోతుంది.కొవిడ్ వల్లా,స్టిరాయిడ్ వల్లా ఒక్కోసారి షుగరు అపరిమితంగా పెరిగి High Dose Insulin ఇవ్వవలసిఉంటుంది.డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లేటప్పుడు కూడా షుగరు ఎక్కువ ఉంటే, ఒక గ్లూకోమీటరు కొనుక్కోండి.షుగరు మంచి అదుపులో ఉండటం చాలా అవసరం.

*PRONE POSITION* :ఆక్సిజన్ 94 శాతం కన్నాతగ్గిన కొవిడ్ పేషెంట్లు వెల్లికిలా కాకుండా, అరగంటకొకసారి అన్ని వైపులకు తిరిగి పడుకుంటూ, అలామారుతూ ఉంటే చాలా మంచిది. మెలుకువగాఉన్నప్పుడు ఒక 30 నిమిషాలు బోర్లా, ఒక 30నిమిషాలు కుడి వైపూ, ఒక 30 నిమిషాలు ఎడం వైపూ,ఒక 30 నిమిషాలు కూర్చోవటం వంటివి చేస్తే ఆక్సిజన్శాతం మెరుగవుతుంది.నిద్రపోయే 8 గంటలు వదిలేసి, మెలుకువగా ఉన్న 16గంటలూ ప్రతి 30 నిమిషాలకొకసారి పొజిషన్ మారితూఉంటే చాలా మంచిది.తినగానే బోర్లా పడుకోరాదు. గర్భిణీ స్త్రీలు, ఎముకలు విరిగిన వారూ, రక్తనాళాలు గడ్డకట్టిన వారు, గుండెబలహీనంగా ఉన్నవారూ బోర్లా పడుకోరాదు.14 రోజుల హోమ్ ఐసోలేషన్ తరువాత, కొవిడ్ గొంతుపరీక్ష చేయించుకొని కొవిడ్ ఉందో లేదో చూసుకోవాల్సినఅవసరమే లేదు.

DOACS – రక్తం పలుచన చేసే (Apixaban 2.5 mgBD, Rivoraxaban 10 mg OD) మందులు: D dimerఎక్కువగా ఉన్న ఓఓ పేషెంట్లకి ఇస్తారు. హాస్పిటల్లోచేరగానే వాటి స్థానంలో Enoxaparin (LMWH)ఇస్తారు. మరలా డిశ్చార్జ్ అయ్యేటప్పుడుఊపిరితిత్తులు ఎంతమేర పాడయినాయి అనేదానినిబట్టి ఆ మందులు డిశ్చార్జి తరువాత కూడా కొన్నిరోజులు వాడితే మంచిది. (~ 50% lung damage -for 6 weeks ; ~ 80% lung damage – give for 6months)ఊపిరితిత్తులు పాడయిపోయిన వారు జబ్బు తీవ్రంగాఉన్న సమయంలోనే గాక, తరువాత కూడా చాలా వారాలు ప్రాణాయామం, Incentive spiromretryవంటి వ్యాయామాలు రోజూ రెండు పూటలా చేస్తేఊపిరితిత్తులు తొందరగా రికవర్ అవుతాయి. లేకపోతే,ఎంతోకంతడామేజీ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది.

*కొవిడ్ సాధారణంగా రెండు వారాల జబ్బు -*

మొదటి వారం సాధారణ వైరస్ ఇన్ఫెక్షన్ జలుబునిపోలి ఉంటుంది. మొదటివారంలో గొంతు పరీక్షలోపాజిటివ్ వస్తుంది. ఎక్కువ మందికి Mild Covidఉంటుంది.జబ్బు గొంతులోనే ఉంటుంది – ఊపిరితిత్తులకు వ్యాపించదు. తీవ్రమైన నెమ్ము రాదు.ఆక్సిజన్ పడిపోదు. అడ్మిషన్ అవసరం ఉండదు.స్టిరాయిడ్ మందులతో పనిలేదు.

90% మంది కొవిడ్ పేషెంట్లకి ఈవారం లక్షణాలుమాత్రమే ఉంటాయి. తేలికగా జబ్బు తగ్గిపోతుంది.కేవలం 10% శాతం మందికే జబ్బు రెండో వారంలోకివెళుతుంది. ఇది చాలా సీరియస్ స్టేజి. ఊపిరితిత్తులుపాడయ్యి ఆక్సిజన్ అవసరమౌతుంది. రక్తనాళాలుగడ్డగట్టటం, ఇన్ఫెక్షన్ చేరటం, షుగరు పెరగటం వంటిఇబ్బందులు ఈ స్టేజీలోనే వస్తాయి. ఈ స్టేజిలోకొంతమందికి ప్రాణహాని కూడా ఉంటుంది.

*కొవిడ్ వైద్యంలో నైపుణ్యమంతా ఈ స్టేజీనివీలయినంత తొందరగా కనుక్కొని, స్టిరాయిడ్ మరియుమిగతా మందులు (రెమిడిసివీర్, Enoxaparin,Antibiotics) వీలయినంత తొందరగా, తీవ్రత అదుపుచేయడానికి సరిపోయేటంత డోసులు పెట్టటంలోనేఉంటుంది.*

దానికోసం పేషెంటుని చాలా Meticulous గా మానిటర్చేయాల్సి ఉంటుంది.రోజూ ఆక్సిజన్ శాతం,6 నిమిషాల నడక పరీక్ష,2 రోజులకొకసారి రక్త పరీక్షలు, అవసరమైతే మరలాఛాతి సిటీ స్కాను చేసుకొని మందుల డోసులు అడ్జస్ట్చేయాల్సిఉంటుంది.

*ఎక్కువ శాతం మందికి జబ్బు మొదలైన 5వ రోజునుండి 12వ రోజు వరకూ చాలా కీలకం. ఈసమయంలోనే జబ్బువందలో ఒక 10 శాతం మందికిరెండో స్టేజీలోకి వెళుతుంది.* ఈ సమయంలో జబ్బుఒక్కోసారి అనూహ్యంగా ముదిరిపోయి ఆక్సిజన్ శాతంతీవ్రంగా పడిపోతుంది. ఒక్కోక్కరికి 3వ వారంలో కూడాజబ్బు ముందుకెళ్లవచ్చు.

*రోజూ ఆక్సిజన్ శాతం* చూసుకుంటే, ఇటువంటిఇబ్బంది *ఏరోజు వస్తే – ఆరోజే కనిపెట్టవచ్చును.*

*రోజూ 6 నిమిషాల నడక పరీక్ష చేస్తూ ఉంటే*,ఆక్సిజన్ రేపు తగ్గిపోతుందనగా, *చాలా మందిలోఒకరోజు ముందే కనిపెట్టవచ్చు.*

*మొదటివారం చివరినుండీ, రెండు రోజుల కొకసారిఅవసరమైన రక్త పరీక్షలు చేసుకుంటా ఉంటే* ,ఆక్సిజన్శాతం పడిపోయి జబ్బు తీవ్ర రూపం దాల్చే పేషెంట్లని*రెండు రోజుల ముందే పసిగట్టవచ్చు.*ఆ పరిస్థితే రాకుండా ముందుగానే మందుల డోసులుపెంచవచ్చు.*రాబోయే 48 గంటలలో పేషెంటు ఆరోగ్యస్థితి ఎంత పాడయిపోతుందీ – లేదా మెరుగవుతుందీఅనేది ఊహించి దానికి తగ్గట్టు వైద్యంలో మార్పులుచేర్పులు చేయడమే కొవిడ్ వైద్యంలో కీలకం. ఒక్కోపేషెంటు మనం ఊహించిన దానికన్నా వేగంగా జబ్బుముందుకెళ్లి అందుబాటులో ఉన్న ఏమందులకులొంగదు.* అటువంటి వారికి వెంటిలేటరు, ప్రయోగాత్మకదశలో ఫలితం చూపిన కొన్ని మందులనూ ప్రయత్నించవచ్చు.

*సొంత కొవిడ్ వైద్యాలు (Self Medication) వద్దు.*

అనింటికన్నా ముఖ్యమైన విషయం ధైర్యంగా ఉండటం.మీ ధైర్యం మీకు బలాన్ని ( Immunity) పెంచుతుంది.అనవసరమైన భయాందోళన వలన మీరు మీకుమరియు సమాజానికి చేటు చేస్తున్నారు.అనవసరమైన హాస్పిటల్ అడ్మిషన్స్ కేవలం భయంవలన చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.చాల మందిఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చును.నిజంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అయిన వారికిహాస్పిటల్ లొ beds దొరకటం లేదు.ఇంటి వద్దే మీ డాక్టరు పర్యవేక్షణ లొ ట్రీట్మెంట్తీసుకోండి. అనవసరమైన హాస్పిటల్ అడ్మిషన్స్ నికనుక ఈ స్టేజ్ లొ మనం కంట్రోల్ చేయగలిగితే చాలమంది అవసరమైన వారికి సహాయం చేసినవాళ్ళమౌతాము.కేవలం Covid 19 RT PCR positive రిపోర్ట్ రాగానేహాస్పిటల్ లొ అడ్మిట్ అవుదాం/ అవ్వాలి అనే ఆలోచననుండి అందరూ బయటకు రావాలి.Saturations SPO2 ఇంట్లో monitor చేసుకోండి,రెగ్యులర్ గ మీ డాక్టరు తో సంప్రదించండి, వారి సలహాలు మాత్రమే పాటించండి. Google knowledge & WhatsApp knowledg eదూరంగా ఉండండి.

ఎన్నో అవాంతరాలను అధిగమించిన భారతదేశం ఈCovid 19 infection నీ కూడా అధిగమించివిజయపథంలోముందుకు నడవాలి, అందుకు మనఅందరి సహకారం అన్ని విధాలుగా ఉండాలి.

Dr K.S.Somasekhar Rao

MD;DM.

Read Today's Latest Health Telugu in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us