PM Modi : ప్రధాని మోడీకి రాంగ్ ఇన్ఫర్మేషన్?..

PM Modi : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకే తప్పుడు, అసంపూర్తి సమాచారం అందిందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన మొన్న బుధవారం ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలను తప్పుపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కొవిడ్-19 టీకా ఎక్కువగా వృథా అవుతున్నట్లు మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాగే జరుగుతోందని చెప్పారు. జీరో వేస్టేజీ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

కేంద్ర అధికారులదీ అదే మాట..

అదే రోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇదే మాట చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా టీకాను వృథా చేయటంలో తెలంగాణ ఫస్టు ప్లేస్ లో, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయని అన్నారు. అప్డేటెడ్ డేటా ప్రకారం తెలంగాణలో ఏకంగా 17.6 శాతం వ్యాక్సిన్ వేస్ట్ అవుతున్నట్లు లెక్కలు బయటపెట్టారు. ఇది కంట్రీ యావరేజ్ (6.5 శాతం) కన్నా చాలా ఎక్కువంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

PM Modi : pm modi delivered wrong information on corona vaccination wastage
PM Modi : pm modi delivered wrong information on corona vaccination wastage

తెలంగాణ ఆఫీసర్ల వివరణ: PM Modi

ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నట్లు తెలంగాణలో కొవిడ్-19 టీకా అధికంగా వృథా అవుతోందనేది అబద్ధమని తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసర్లు ఖండించారు. వ్యాక్సినేషన్ ని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నాయని, అందుకే వాళ్లు రాంగ్, ఇన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బఫర్ స్టాక్, రాష్ట్రంలోని సైనికులకు ఇచ్చిన వ్యాక్సిన్ వివరాలను పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లే ఈ తప్పుడు అంకెలు ప్రచారంలోకి వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నికర వృథా కేవలం 1.22 శాతమేనని వివరించారు. అయితే.. తప్పు ఎవరిదైనా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో రిమార్కులు పడినట్లయింది.

Advertisement