KIDS : పిల్ల‌ల ఆరోగ్యం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

KIDS : డ‌బ్బులు పెట్టి మ‌నం ఏ వ‌స్తువునైన కొన‌వ‌చ్చు, కాని ఆరోగ్యాన్ని మాత్రం కొన‌లేం అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. అందుకే ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అంటారు పెద్ద‌లు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఆరోగ్యం విష‌యంలో త‌ప్ప‌నిస‌రి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఏ మాత్రం అశ్ర‌ద్ధం చేసిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల విష‌యంలో అజాగ్ర‌త్త వ‌హించ‌వ‌ద్దు. అలా చేయ‌డం వ‌ల‌న ఒక్కోసారి రోగం ముదిరి ప్రాణాంత‌క‌రంగా మారుతుంది. అయితే పిల్ల‌ల‌లో సాధారణంగా వచ్చే స‌మ‌స్య‌ల‌పై త‌ల్లిదండ్రులు అవ‌గాహ‌న పెంచుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

ఉష్ణ మండ‌ల దేశాల్లో ఎండాకాలం వాతావ‌ర‌ణం ఎంత వేడిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ స‌మ‌యంలో పెద్ద వాళ్ల శ‌రీరం చాలా వెచ్చ‌గా అనిపిస్తుంటుంది. అలాంటింది పిల్ల‌ల‌కు కూడా ఒళ్లు వెచ్చ‌బ‌డి జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది. దీంతో త‌ల్లిదండ్రులు జ్వ‌రం వ‌చ్చింద‌ని భావించి ఏవేవో సిర‌ప్‌లు వాడుతుంటారు. కాని ఆ స‌మ‌యంలో మ‌నం చేయాల్సింది చాలా ప్ర‌శాంతంగా ఉండ‌డం. అనంత‌రం శిశువు ఉన్న గ‌ది ఉష్ణోగ్ర‌త కాస్త త‌గ్గేలా చేసి ఆ త‌ర్వాత త‌డి గుడ్డ‌తో ఒళ్లంతా తుడ‌వ‌డం వంటివి చేయాలి. శ‌రీర ఉష్ణోగ్ర‌త కాస్త ఎక్కువ‌గా అనిపించిన స‌మ‌యంలో దుస్తులు కాట‌న్ దుస్తులు వేయాలి. త‌ల్లి పాలు త‌ర‌చు తాగిస్తూ ఉండాలి.

పిల్ల‌ల‌కు ఆరు నెల‌లు వ‌చ్చే వ‌ర‌కు మంచి నీరు తాగించ‌కూడ‌దు, జ్వ‌రం మందులు వేయ‌కూడ‌దు. గ‌దిని చ‌ల్ల‌గా ఉంచుతూ ఒళ్లు వేడెక్క‌కుండా తడి గుడ్డ‌తో తూడుస్తూ ఉండాలి. ఏసీ లేదా కూల‌ర్ గాలి డైరెక్ట్‌గా శిశువుకు త‌గల‌కుండా చూడాలి. ఫ్యాన్‌ను ఒక‌టో నెంబ‌ర్ మీద ఉంచాలి. గ‌ది పై భాగంలో ఉష్ణాన్ని పీల్చుకునే సున్నం వేయాలి. ద్వారాలకు, కిటికీలకు తెరలు వేలాడదీసి, వాటిని తరుచూ తడుపుతూ ఉండాలి. ఫ్లోర్ మీద కూడా నీళ్లు జ‌ల్లుతూ ఉంటే ఇంటి వాతావ‌ర‌ణం చల్ల‌గా ఉంటుంది. ఇలా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బిడ్డ హాయిగా, ప్ర‌శాంతంగా ఉంటుంది. రెండు మూడు రోజుల‌లో జ్వ‌రం కూడా త‌గ్గిపోతుంది. శిశువు ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ దగ్గరే స్థిరంగా ఉండేలా చూసుకోవాలి, కాస్త ఎక్కువ అవుతుంద‌ని అనుకున్న‌ప్పుడు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

Advertisement