Lock Down : బ్రేకింగ్ న్యూస్ : లాక్ డౌన్.. ఫేక్ జీవో.. క్రియేట్ చేసింది ఇతనే..

Kondala Rao - April 5, 2021 / 01:43 PM IST

Lock Down : బ్రేకింగ్ న్యూస్ : లాక్ డౌన్.. ఫేక్ జీవో.. క్రియేట్ చేసింది ఇతనే..

Lock Down : కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైనప్పటికీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ పెట్టబోమంటూ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే ఇటీవల శాసన సభలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తి కొద్ది రోజుల కిందట ఒక ఫేక్ జీవోని క్రియేట్ చేశాడు. తెలంగాణలోనూ కొవిడ్-19 వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఒక నకిలీ జీవోని సర్క్యులేట్ చేశాడు. ఏప్రిల్ ఒకటో తేదీన వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంచలనం రేపింది.

ఎట్టకేలకు అరెస్ట్..

ఈ డమ్మీ జీవోని రూపొందించిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఇవాళ సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అతని పేరును శ్రీపతి సంజీవ్ కుమార్ గా గుర్తించారు. నిందితుడు కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)గా పని చేస్తున్నాడని, అతని స్వస్థలం నెల్లూరు పట్టణం అని తేలింది. సంజీవ్ కుమార్ నుంచి ఒక ల్యాప్ టాప్ ను, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ నకిలీ ఉత్తర్వును సంజీవ్ కుమార్ సరిగ్గా సర్కారు జీవో మాదిరిగానే తయారుచేశాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ పేరుతో దీన్ని విడుదల చేశాడు. ప్రభుత్వం గతంలో రిలీజ్ చేసిన జీవోని డౌన్ లోడ్ చేసి, డేట్లు మార్చి, కొత్త జీవోగా కలరింగ్ ఇచ్చి, ఫ్రెండ్స్ తో కలిసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని అంజనీ కుమార్ వివరించారు.

Lock Down : lock down fake GO creator arrest

Lock Down : lock down fake GO creator arrest

బీ కేర్ ఫుల్: Lock Down

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్నవాళ్లు నిజానిజాలేంటో తెలుసుకున్నాకే డేటాని ఫార్వర్డ్, షేర్ చేయాలని సలహా ఇచ్చారు. ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నెల 30 దాక..

ఈ నకిలీ ఉత్తర్వుల్లో సంజీవ్ కుమార్ లాక్ డౌన్ ఆంక్షలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని షాపులు, వ్యాపార సంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించిందని చెప్పాడు. ఈ జీవో సేమ్ గవర్నమెంట్ ఉత్తర్వులాగే ఉండటంతో చాలా మంది నిజమనుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం ప్రభుత్వానికి తెలియటంతో సీరియస్ అయింది. అది నేను రిలీజ్ చేసిన జీవో కాదంటూ సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించాల్సి వచ్చింది. రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని ఆయన ప్రభుత్వం తరఫున మరోసారి స్పష్టం చేశారు. ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని కూపీ లాగగా నేరస్తుడు చివరికి ఇవాళ చిక్కాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us