Hypoglycemia: హైపోగ్లైసీమియా ఒక్కసారి అట్టాక్ట్ అయ్యిందో చాలా డేంజర్..అస్సలు ఈ వ్యాధి ఏంటి ఎవరికి వస్తుంది

Hypoglycemia
Hypoglycemia

Hypoglycemia హైపోగ్లైసీమియా అనేది డయాబెటిస్ ఉన్న వాళ్లలో చాలా కామన్ గా కనిపించే కాంప్లికేషన్స్ లో ముఖ్యమైనది. ఉండాల్సిన స్థాయి కన్నా రక్తంలో చెక్కెర తక్కువగా ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. 70 మిల్లీ గ్రామ్స్ / డిసీ లీటర్ కన్నా తక్కువగా ఉంటే హైపో గ్లైసీమియా అంటారు.

లో బ్లడ్ షుగర్ ఉంటే వ్యక్తికి ఏమవుతుందో తనకే తెలియని పరిస్థితి లో ఉంటాడు. శరీంలోని అవయవాలకు గ్లూకోజ్ అందదు. దీంతో అవయవాలు సరిగా పనిచేయవు. అలాంటి పరిస్థితుల్లో గుండెకు సమస్యలు ఏర్పడతాయి. హై పో గ్లైసీమియా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చెక్కెర స్థాయి తగ్గిపోతే.. ఆ ప్రభావం బ్రెయిన్ మీద తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు బ్రెయిన్ లో న్యూరాన్స్ చనిపోతాయి. అంతేకాకుండా బ్రెయిన్ లో రకరకాల మార్పులు వచ్చి కోమాలోకి వెళ్లి పోయే అవకాశం కూడా ఉంటుంది.

ఓ వ్యక్తికి హైపోగ్లైసీమియా ఉంటే రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి, వణకు, అశాంతిగా ఉండటం, చెమట పట్టడం, మైకము లేదా తల తిరగటం, నిద్రమత్తు, గందరగోళం, మాట్లాడటంలో కష్టం, ఆందోళన, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే రక్తంలో చెక్కెర స్థాయి పడిపోకుండా చూసుకోవాలి.

సాధారణంగా హైపోగ్లైసీమియా అనేది అనేక కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. మెడిసిన్స్ ఎక్కువగా అంటే తీసుకోవాల్సిన దాని కన్నా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హైపర్ గ్లైసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో సమయానికి ఆహారం తీసుకోకపోయినా, ఆహారం తక్కువ తీసుకున్నాకూడా రక్తంలో చెక్కెర స్థాయి పడిపోతుంది. ఒక్కోసారి వ్యాయామం ఎక్కువ చేసినా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఆల్కహాల్ అంటే విస్కీ, బ్రాందీ లాంటివి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నా.. కూడా రక్తంలో చెక్కెర స్థాయి పడిపోతుంది.

హైపోగ్లైసీమియా సమస్య రాకుండా ఉండాలంటే మోతాదుకు మించి మందులు వాడకూడదు. అలాగే వ్యాయామం రెగ్యులర్ గా ఎంత సేపు చేస్తామో అదే ఫాలో అవ్వాలి. ఒకవేళ వ్యాయామం ఎక్కువగా చేయాల్సి వస్తే.. కార్బొహైడ్రేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే అందుకు తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆల్కహాల్ పూర్తిగా మానేయడం మంచింది. ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉన్న కూడా హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఉంది.

హైపోగ్లైసీమియా రెండు రకాలు. ఒకటి మైల్డ్ హైపోగ్లైసీమియా., రెండోది సివియర్ హైపోగ్లైసీమియా. మైల్డ్ అంటే వ్యక్తి ఎవరికైతే ఈ సమస్య ఉందో.. ఆ వ్యక్తి తనకు తానే ట్రీట్ మెంట్ చేసుకోగలిగితే మైల్డ్ హైపోగ్లైసీమియా అంటారు.

సివియర్ హైపోగ్లైసీమియా ఉన్న వ్యక్తి అసలు స్పృహలో ఉండరు. వారికి వేరే వాళ్లు ట్రీట్ మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితినే సివియర్ హైపోగ్లైసీమియా అంటారు. రక్తంలో చెక్కెర స్థాయి పడిపోతే.. ఒక స్పూన్ చెక్కెర కానీ, స్పూన్ తేనె కాని పట్టించాలి. లేదంటే కూల్ డ్రింక్ కాని తాగితే మళ్లీ షుగర్ లెవెల్స్ పెరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement