Health Tips : నోటి దుర్వాసనకు చెక్ పెట్టండిలా.. భోజనం తర్వాత ఇలా చేస్తే సరిపోతుంది
NQ Staff - June 15, 2022 / 10:34 PM IST

Health Tips : నోటి దుర్వాసన సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఏం తిన్నా తినకపోయినా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు కావచ్చు. అయితే నోటి దుర్వాసనను పోగొట్టడం చాలా సులభం. భోజనం చేశాక కొన్ని పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.

Health Tips for good breathing
నోటి దుర్వాసన పోవాలంటే చిట్కాలు…
-పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోటి దుర్వాసన రాదు.
– భోజనం చేశాక 30 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగాలి. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
-భోజనం చేశాక రెండు లవంగాలను నోట్లో వేసుకోవాలి. చాలా సేపు చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
– భోజనం చేసిన తర్వాత టీ స్పూన్ సోంపు తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
– విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు , దంతాలు దృఢంగా ఉంటాయి.
-భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమలాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు.