Health Tips : బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ తగ్గింపు వరకు.. గ్రీన్ టీతో ఇన్ని లాభాలా..!

NQ Staff - October 7, 2023 / 04:35 PM IST

Health Tips : బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ తగ్గింపు వరకు.. గ్రీన్ టీతో ఇన్ని లాభాలా..!

Health Tips :

యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నేటితరం అధిక బరువుతో బాధపడుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం.. అందుకు కారణాలు ఏమిటి? అనే దానిపై మాత్రం ఫోకస్ చేయలేకపోతున్నారు చాలా మంది. బరువు పెరగడం సులభమే. కానీ తగ్గాలంటే మాత్రం చాలా చెమటోడ్చాల్సి వస్తుంది. యాంత్రిక జీవనం పాటించే వాళ్లు బరువు తగ్గేందుకు యోగా, జిమ్ లాంటివి అలవాటు చేసుకుంటున్నారు. అందుకోసం వారు సంపాదించిన దాంట్లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎలాంటి ఫీజులు, వర్కౌట్లు లేకుండా కూడా అధిక బరువును కంట్రోల్ చేసుకోవచ్చని మీలో ఎవరికైనా తెలుసా? అందుకోసం ప్రతి రోజూ రెండు నుంచి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అధిక బరువును కంట్రోల్‌లో ఉంచుతుందని సూచిస్తున్నారు. ఎటువంటి వర్కౌట్స్ సాయం లేకుండానే శరీరంలోని కొవ్వును కప్పు గ్రీన్ టీ తాగి తగ్గించుకోవచ్చన్నారు. నేటితరం ఎక్కువగా శరీరాన్ని కష్టపెట్టడం లేదు. వర్క్ కూడా ఒకే దగ్గర కూర్చుని బాడీ అలిసిపోకుండా చేస్తున్నారు.

దీంతో మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. ఆహారం తీసుకున్నాక వెంటనే కూర్చోవడం, వాకింగ్ చేయకపోవడం, ఉదయాన్నే వ్యాయామాలు చేయకపోవడం కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అందుకే ఉదయాన్నే ఒక కప్పు వేడివేడిగా గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగడం వలన కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి జీవక్రియను పెంచడానికి , శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగడం వలన రిఫ్రెష్ మెంట్ కూడా కలుగుతుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ గుణాలు ఉంటాయి. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. వేగవంతమైన జీవక్రియ అంటే మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా మీ శరీరంలోని కేలరీలు సమర్థవంతంగా కరుగుతాయి.

గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. ఇది సహజ ఉద్దీపనంగా పనిచేస్తుంది. వర్కౌట్‌ల ద్వారా శక్తిని పొందేలా అదనపు శక్తిని ఇస్తుంది. కెఫెన్ మంచి నిద్ర మత్తు కారకం. నిద్రలేమితో బాధపడేవారికి హాయి నిద్రను కూడా అందిస్తుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చక్కెర, కొవ్వు పదార్థాల కోసం ఆకలి, కోరికలను తగ్గించే శక్తి దీనికి ఉంటుంది.దీంతో బయటకు వెళ్లిన సమయంలో జంక్ ఫుడ్ తిన్నాలన్నా కోరికను చంపేస్తుంది. ఫలితంగా శరీరంలో జీవక్రియలు సజావుగా సాగుతాయి. కొవ్వుశాతం పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించేందుకు అవసరమైన సుగుణాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. దీంతో బెల్లీ ఫ్యాటీ, చేతులు, తొడలు, నడుము వంటి ప్రాంతాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోయే చాన్స్ ఉండదు. దాంతో ఒబెసిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చును.

అందుకే వైద్యులు ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకోవాలని సూచిస్తున్నారు. చాయ్ స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చాయ్ అనేది ఆకలిని తగ్గించేసి ఎసిడిటీకి కారణం అవుతుంది. కానీ గ్రీన్ టీ తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us