Garlic : ఉద‌యాన్నే వెల్లుల్లి తింటే ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా?

NQ Staff - July 12, 2022 / 06:06 PM IST

Garlic  : ఉద‌యాన్నే వెల్లుల్లి తింటే ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా?

Garlic  : వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా కొంద‌రికి ప‌డ‌దు. కాని వెల్లుల్లి వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మ‌లు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం.

వెల్లుల్లితో ఉపయోగాలు ఎన్నో..

వెల్లుల్లి లోని చిన్న చిన్న పాయలే… మన శరీరానికి ఆయుధాల్లా మారి… గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్, ఇన్ఫెక్షన్ల నుంచీ కాపాడతాయి.. వెల్లుల్లిలో ఉండే చిన్న చిన్న పాయల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్షక్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకుపంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా వెల్లుల్లిని తినండి.

దీని వల్ల బాడీ మెటబాలిజం (అన్నివ్యవస్థలూ సక్రమంగా పనిచెయ్యడం) బాగుంటుందనీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయనీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌ని నివారించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ చిన్న చిన్న పాయలే… మన శరీరానికి ఆయుధాల్లా మారి… గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్, ఇన్ఫెక్షన్ల నుంచీ కాపాడతాయి. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఉదయాన్నే వెల్లుల్లి తింటే మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

Garlic Helps in weight Loss Stimulating Enzymes Digestive Tract

Garlic Helps in weight Loss Stimulating Enzymes Digestive Tract

ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచీ గట్టెక్కవచ్చు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

మన బాడీలో బ్రెయిన్ ఎంతో కీలకం. దానికి ఆక్సిజన్ ద్వారా విషపూరిత పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్‌ని క్లీన్ చెయ్యాలంటే వెల్లుల్లి తినాలి. ఇవి మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి. అంతేకాదు… పని ప్రదేశంలో మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్తకొత్త ఐడియాలు ప్రవాహంలా వస్తాయి.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us